జాజికాయ‌ల‌తో కలిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

జాజికాయ మ‌సాలా దినుసుల జాబితాకు చెందుతుంది. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి త‌మ వంట ఇళ్ల‌లో ఉప‌యోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జాజికాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. జాజికాయ‌ల్లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నిర్మూలిస్తాయి. క్యాన్స‌ర్లు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. జాజికాయ‌ల్లో ఉండే స‌య‌నైడిన్స్‌, ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి.

2. జాజికాయ‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇవి గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్‌, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లను రాకుండా చూస్తాయి. జాజికాయ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. జాజికాయ‌ల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

4. జాజికాయ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇవి బాక్టీరియాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. బాక్టీరియా సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి.

5. జాజికాయ‌ల పొడిని తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె సుర‌క్షితంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

6. ఒత్తిడిని త‌గ్గించే గుణాలు జాజికాయ‌లో ఉన్నాయి. వీటి పొడిని నిత్యం తీసుకుంటే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

7. జాజికాయ‌ల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

8. జాజికాయ‌ల పొడిని టీ, స్మూతీలు, ఇత‌ర ఆహారాల్లోనూ తీసుకోవ‌చ్చు. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Add Comment