మారేడు పండు జ్యూస్ అద్భుత గుణాలు .. సహజ ఆరోగ్య కవచం

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాల్లో మారేడు పండు (బేల్ ఫ్రూట్) జ్యూస్ ప్రధానంగా చెప్పుకోవాలి. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ నుంచి చర్మం, జుట్టు వరకు అనేక సమస్యలకు మారేడు పండు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది.

జీర్ణక్రియకు మేలు

మారేడు పండులో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్

విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన మారేడు పండు జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో సాధారణంగా వచ్చే జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది.

చర్మం & జుట్టుకు మేలు

మారేడు జ్యూస్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. మొటిమలు, మచ్చలు, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అలాగే జుట్టును బలపరచి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

షుగర్ & గుండె ఆరోగ్యం

మారేడు పండు రసం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది . ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి గుండె సంబంధ సమస్యలను నివారిస్తాయి.

కంటి చూపుకు మేలు
మారేడు పండులోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపడటానికి సహకరిస్తుంది.

Add Comment