Palmyra Sprout : మనం రోడ్డు మీద అమ్ముతూ ఉన్న తేగలని చూస్తూనే ఉంటాం.’ తేగ ‘ అనేది ఒక తాటి మొలక. తాటికాయ పండిన తర్వాత, అందులో టెంకను పగల కొట్టి, ఆ టెంకలో ఉన్నటువంటి పదార్థాన్ని పిసికి సేకరిస్తారు. ఇలా సేకరించిన పదార్థాన్ని తాటి ఇడ్లీలను మరియు తాటి గారెలను వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అలాగే తెగలకు మరియు నాగుల చవితికి పురాణాల్లో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నాగులు చవితి తరువాత ఈ తెగలను వెలికి తీసి విక్రయిస్తుంటారు. అయితే ఇలా తెగలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి స్త్రీలు తప్పనిసరిగా ఎందుకు తినాలి.?
షుగర్ వ్యాధి ఉన్నవారు తినవచ్చా..? తెగలను ఎక్కువగా తింటే ఏమవుతుంది..? తెగల్లో పోషకాలు ఏమి ఉన్నాయి.తెగలకు సంబంధించిన అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం… ఈ తెగలని ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. వీటిని గేగులు అని కూడా అంటారు. ఈ తెగలలో విటమిన్ బ, విటమిన్ సి, అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తేగలలో 27 కిలో క్యాలరీల తో పాటు 77 గ్రాముల నీరు కూడా ఉంటుంది. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా అందిస్తుంది. ఆస్టియోఫోరోసిస్, నరాల సంబంధిత సమస్యలకు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది.
Palmyra Sprout గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఈ తేగళ్లలో ఒమేగా- 3 ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు శరీర కణాలను రక్షించడంతోపాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.
Palmyra Sprout మధుమేహం ఉన్నవారు తినొచ్చా
తేగల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించుటకు కూడా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని తినొచ్చు. దీనిలో పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీన్ని డాక్టర్ సలహా మేరకు వినియోగించవలసి ఉంటుంది.
కడుపు ఆరోగ్యం : తేగల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ద్వారా మలబద్ధకాన్ని తగ్గించవచ్చు. కడుపులోని పేగులలో ఉన్న పురుగులు నివారించబడతాయి. అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా అదుపు చేయగలదు.
ఎముకలు ఆరోగ్యం : తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు మరియు దంతాలకు బలాన్ని అందిస్తుంది. పిల్లలకు ఇది మంచి ఆహారం. ఇది ఎముకల సమస్యలకు మరియు కండరాల నొప్పులకు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది అందువల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
స్త్రీలకు అద్భుత ప్రయోజనాలు : ఈ తేగలను ఉడకబెట్టి మెత్తగా చేసి బెల్లం లేదా చెక్కర్లతో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయం బలంగా మారుతుంది. అలాగే కొబ్బరి పాలతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు గ్రహించవచ్చు.అలాగే నీరసంతో అలసిపోయే మహిళలు ఈ తేగలను ఎండబెట్టి పొడి చేసి బెల్లం లేదా తాటి సిరప్ తో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది. తల్లులు ప్రసవం తర్వాత తేగలను తినడం వల్ల డిలవరిలో పోయిన పోషకాలు తిరిగి మరల పొందవచ్చు. అంతేకాదు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ తెగలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
అలాగే మహిళల్లో క్యాన్సర్ కణాలను వృత్తి చెందకుండా నిరోధించబడుతుంది. ఇందులో విటమిన్ A, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 40 సంవత్సరాలు భయపడిన మహిళలు తరచూ ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటే. ఇది రుతుక్రమం ఆగిపోయే సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంది. తెగలు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేసి, రక్తప్రసరణను నిర్ధారించడానికి మరియు రానికి అవసరమైన ఆక్సిజన్ అందించటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారుగా తేగల్లో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. మరి ఇంకెందుకు ఆలస్యం…ఈసారి ఎక్కడన్నా ఈ తేగలు కనిపిస్తే వదలకుండా తినండి.