Pippali Benefits : ఇది మసాలా.. కానే కాదు.. అనారోగ్య సమస్యకు బ్రహ్మాస్త్రం… దీని లాభాలు తెలుసా…?

Pippali Benefits : అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకొనుటకు కొన్ని దివ్య ఔషధాలు ఉన్నాయి. అటువంటి ఔషధమే పిప్పలి. ఈ పిప్పలినే పిప్పళ్ళు అని కూడా పిలుస్తారు. ఇంకా పేపర్ అని కూడా పిలుస్తారు. మరి ఆయుర్వేద శాస్త్రంలో అనేక రోగాలకు ఒక దివ్య ఔషధం ఈ పిప్పళ్ళు. ఈ సుగంధ ద్రవ్యాన్ని పిపాలి చెట్టు పండు నుండి సేకరిస్తారు. తిప్పలి ఆరోగ్య ప్రయోజనాలు కారణంగా ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ పిప్పలే సాధారణంగా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయుటకే కాదు అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా తగ్గించుటకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి దీని సరిగ్గా ఉపయోగించినట్లయితే ఫలితం తప్పక ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం…

పిప్పలి జీర్ణ క్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది. జీర్ణశక్తిని పెంచుతుంది. గ్యాస్ మరియు అజీర్ణం,మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ఎసిడిటీ సమస్యలు మరియు గ్యాస్ సమస్యలు ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ పిప్పలు శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుటకు సహాయపడుతుంది మరియు దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గించుటకు సహకరిస్తుంది. ఈ పిప్పలి మసాలా జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. నా శరీరంలో అదనపు కొవ్వులను కూడా కరిగించి వేస్తుంది. దీని దీనివలన ఆ శరీరంలో కొవ్వు పేరుకు పేరుకు పోకుండా మరియు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా శరీరం నుండి విషయాన్ని బయటకు పంపిస్తుంది.

పిప్పలు వినియోగం రోగనిరోధక శక్తిని కూడా బలపరచగలదు. ఇది యాంటీ ఇన్ఫర్మేషన్,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. ఈ తిప్పలి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలసట మరియు బలహీనతను కూడా తగ్గిస్తుంది. పిప్పలి కషాయం తాగడమే కాకుండా, దానిని పొడి మరియు తేనె అల్లంతో కలిపి తినవచ్చు. ఈ పిప్పలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది,కాబట్టి దీన్ని ఎక్కువగా తినకూడదు. తక్కువ మోతాదులో తీసుకోవాలి.

Add Comment