Racha Ravi : ర‌చ్చ ర‌వి ఎమోష‌న‌ల్.. గ‌తాన్ని త‌లచుకుంటూ క‌న్నీరు..!

Racha Ravi : 2013లో ప్రారంభమైన జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ వేదికపై కామెడీ యాక్టర్‌గా వెలుగొందిన ఆయన… ఇటీవల నిర్వహించిన 12వ వార్షికోత్సవ వేడుకలో ఎమోషనల్ అయ్యారు. ప్రత్యేక ఎపిసోడ్‌ను రూపొందించిన జబర్దస్త్ టీమ్, పాత ఆర్టిస్టులను, మాజీ జడ్జి నాగబాబును, యాంకర్ అనసూయను ఆహ్వానించారు.

వేణు వండర్స్, అదిరే అభి, చలాకీ చంటీ, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రచ్చ రవి వంటి పేరుగాంచిన కమెడియన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో రచ్చ రవి మాట్లాడుతూ.. నేను రోజూ అన్నం తినేప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తి చమ్మక్ చంద్ర అన్న. ఆయన లేనిదే నేనే లేను. నా జీవితం ఆయ‌న వ‌ల్ల‌నే నిలబడింది అంటూ భావోద్వేగంతో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. మొదటిసారి రచ్చ రవిని ఇలా ఎమోషనల్ అవటం జబర్దస్త్ ఫ్యాన్స్‌ను కదిలించింది.

హన్మకొండలో జన్మించిన రవి, డైరెక్టర్ క్రిష్ తండ్రి సాయిబాబా దగ్గర పనిచేశారు. పుత్తడి బొమ్మ, శిఖరం వంటి సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన, ఆ తరువాత చమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్ ద్వారా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలంగాణ యాసలో తనదైన స్టైల్ కామెడీతో ప్రేక్షకుల్ని మైమరిపించారు. ఇటీవ‌ల‌ రాం రాఘవం, బాపు, శ్రీశ్రీశ్రీ రాజావారు లాంటి సినిమాల్లోనూ నటించారు. అయితే జబర్దస్త్ వేదిక రచ్చ రవికి అవకాశాన్ని మాత్రమే కాదు, ఒక జీవితాన్ని కూడా ఇచ్చింది.

Add Comment