Ridge Gourd : బీరకాయ వీళ్ళకు మాత్రం విషంతో సమానం… తిన్నా రో ఇక అంతే…?

Ridge Gourd : అదేంటి బీరకాయ తింటే కూడా అనారోగ్యమా. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా అని ఆశ్చర్యపోతున్నారా.. బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు వైద్య నిపుణులు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి బీరకాయ విషంతో సమానమని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. కాబట్టి, కిడ్నీల వ్యాధి బాధితులు బీరకాయ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.బీరకాయ దొరికే సీజన్లో దీనిని కొందరు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

దీన్ని ఎక్కువగా ఇష్టంగా కూడా తింటారు. మరికొందరికి బీరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బీర కాయలతో ఎలాంటి వంటకం చేసినా కూడా రుచిని అందిస్తుంది. అంతే కాదు,ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ తో పాటుగా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సోడియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగి ఉన్న బీరకాయ కొందరికి మాత్రం విషంతో సమానం అంటున్నారు నిపుణులు.సాధారణంగా బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుందని, పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుందని అందరికీ తెలుసు.

సునీతమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు మాత్రం బీరకాయ కు చాలా దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.బీరకాయ తింటే గ్యాస్, ఉబ్బరం, విరోచనాలు, వాంతులు వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయట. అంతేకాదు,ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు బీరకాయ పట్ల చాలా గ్రతలు వహించాల్సి వస్తుంది. ఇంకా కొందరికి బీరకాయ పడకపోవచ్చు. దాంతో వారు బీరకాయ తినడం వల్ల చర్మంపై దురద,మంట, వాపు, దద్దుర్లు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి . బీరకాయ తింటే శరీరంలో దద్దుర్లు, మంట,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలిగి అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా బీరకాయ విషంతో సమానం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాలు,పొటాషియం సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అందువల్ల కిడ్నీ వ్యాధి బాధితులు బీరకాయ తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

Add Comment