ఈయ‌న ఎవ‌రో.. ఇక్క‌డ కూర్చుని ఏం చేస్తున్నాడో తెలిస్తే ఈయ‌న‌ను శ‌భాష్ అని అభినందిస్తారు..!

చిత్రంలో ఒక వ్య‌క్తి కూర్చున్నాడు చూశారా. చిన్న గోడ‌పై కూర్చుని పేప‌ర్‌పై పెన్నుతో ఏదో రాస్తున్నాడు. ప‌క్క‌నే అంద‌రూ లైన్‌లో ప‌ద్ధ‌తిగా నిలుచుని ఉన్నారు. ఏంటి.. ఇదంతా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిత్రం వాస్త‌వానికి మీకు ఊహ‌కు కూడా అంద‌దు. మ‌రి అస‌లు విష‌యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. చిత్రంలో ఉన్న ఆయ‌న పేరు శంకర్ గౌడ‌. ఈయ‌న ఒక డాక్ట‌ర్‌. అవును, మీరు షాక‌వుతున్నా ఇది నిజ‌మే. ఈయ‌న ఎంబీబీఎస్ గోల్డ్ మెడ‌లిస్ట్‌. అవును ఇంకా షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. ఈయ‌న‌ది క‌ర్ణాట‌క‌లోని మండువా. డాక్ట‌ర్ శంక‌ర్ గౌడ మెడిసిన్‌లో గోల్డ్ మెడ‌లిస్ట్‌. క‌ల‌క‌త్తా (ఇప్పుడు కోల్‌క‌తా) మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో చ‌దివారు. ఎండీ ప‌ట్టా కూడా పొందారు. అంత‌టి చ‌దువు చ‌దివినా,

డాక్ట‌ర్ అయినా, గోల్డ్ మెడ‌లిస్ట్ అయినా ఆయ‌న ఎంత సింపుల్‌గా ఉన్నారో చూశారా. ఆయ‌న‌ను చూస్తే అస‌లు అంత ప్ర‌తిభ ఉన్న డాక్ట‌ర్ అని ఎవ‌రూ అనుకోరు. ఇక ఈయ‌న ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. కేవ‌లం రూ.5 ఫీజు మాత్ర‌మే తీసుకుంటారు. రోజూ ఎంతో మందికి ఇలా వైద్యం చేస్తారు. తాను ఉంటున్న‌ది సిటీలో అయినా సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల‌కు రోజూ వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కేవ‌లం రూ.5 ఫీజు మాత్ర‌మే తీసుకుని వైద్యం చేస్తారు. ఇక ఆయ‌న ప్ర‌జ‌ల‌కు రాసే మందులు కూడా చాలా త‌క్కువ ధ‌ర క‌లిగిన‌వే ఉంటాయి. సాధార‌ణంగా ఈయ‌న త‌న పేషెంట్ల‌కు కేవ‌లం జ‌న‌రిక్ మందుల‌ను మాత్ర‌మే రాస్తారు. ఇవి అయితేనే పేద‌లు కూడా కొన‌గ‌లిగే ధ‌ర‌ల‌కు వ‌స్తాయి కాబ‌ట్టి డాక్ట‌ర్ శంక‌ర్ త‌న పేషెంట్ల‌కు జ‌న‌రిల్ మందుల‌నే రాస్తారు.

ఇక ఈయ‌న ఏదైనా ప్లేస్‌కు ఉద‌యం 7 గంట‌ల‌కు వెళ్లారంటే మ‌ళ్లీ సాయంత్రం 7 అయ్యే వ‌ర‌కు అక్క‌డే ఉంటారు. రోజంతా ప్ర‌జ‌ల‌కు వైద్యం అందిస్తూనే ఉంటారు. ఒక గోల్డ్ మెడ‌లిస్ట్ అయి ఉండి తాను త‌లుచుకుంటే చ‌క్క‌ని కార్పొరేట్ హాస్పిట‌ల్ పెట్టి ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. కానీ పేద‌ల‌కు సేవ చేయాల‌ని ఈయ‌న ఇలా కేవ‌లం రూ.5 ఫీజుకే వైద్యం అందిస్తున్నారు. ఇక ఈయ‌న తాను వెళ్లాల‌నుకునే చోటుకి కూడా కారు, బైక్‌పై కాకుండా సైకిల్‌పైనే వెళ్తుంటారు. ఎలాంటి వైద్యం రాక‌పోయినా వేల‌కు వేలు వ‌సూలు చేసే డాక్ట‌ర్లు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ప్ర‌తిభ గ‌ల డాక్ట‌ర్ నిజంగా ఇలా సేవ చేస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈయ‌నను త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే.

Add Comment