ఈ నాలుగు రాశుల వారికి త్వరలోనే పెద్ద ముప్పు .. ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి !!

ఏప్రిల్ 23న గురు గ్రహ సంచారం జరగబోతుంది. గురుడు తన స్థానం నుంచి మేషరాశి లోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు మార్పుల వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కానీ అష్టార్థమ శని మొదలు కాబోతోంది. దీంతో చిన్న చిన్న సమస్యలు బాధించే అవకాశం ఉంది. భార్యాభర్తలలో ఇద్దరిదీ వృశ్చిక రాశి అయితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరిలో ఒక్కరిది వృశ్చిక రాశి అయిన ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. భార్యాభర్తలలో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే వృశ్చిక రాశి వారు శ్రీకాళహస్తిలో గురుదక్షిణామూర్తి ఆలయంలో పూజలు చేయించుకుంటే అంతా మంచే జరుగుతుంది.

ఇక మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. వీరికి వందలో 60 శాతం దురదృష్టం ఉంది. గురు గ్రహ సంచారం వలన మకర రాశి వారికి చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరు అనారోగ్యం పాలవుతారు. ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో చక్కగా ఉంది. అయితే శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఆలయంలో పూజలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. కుంభ రాశి వారికి గురు గ్రహ సంచారం వలన ఆర్థికంగా అండగా ఉంటుంది. గురు బలం వలన కుంభ రాశి వారికి పెద్దగా సమస్యలు అనేవి ఉండవు. కాకపోతే మానసిక సమస్యలు కొన్ని వెంటాడుతాయి. కానీ ధైర్యంగా ఉండాలి. మానసిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే మిగతా సమస్యలు దూరం అవుతాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే శనీశ్వరునికి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

అలాగే మీన రాశి వారికి కుటుంబ పరంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల పరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ఉన్న ఉద్యోగం కోల్పోవడం, మానసికంగా కృంగిపోవడం, అహంభావ భావంతో మనకి సాయం చేసే వాళ్ళని దూరం చేసుకోవడం, డబ్బు మదంతో విచ్చలవిడిగా ప్రవర్తించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటన్నిటి వలన సమస్యల బారిన పడే అవకాశం ఉంది. చాలా సమస్యలు మీన రాశి వారికి ఉండబోతున్నాయి. మీన రాశి వారు శనీశ్వరాలయంలో శని పూజలు చేస్తే కొద్దిగా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నలుపు రంగు వస్తువులను అసలు ధరించకూడదు. ఇలా చేస్తే కొద్దిగా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.