Karthika Masam : ఈ కార్తిక మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు ఫలితాలు అందిస్తాయి. ఈ కార్తీకమాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించిన సరే మనకి ఎంతో పుణ్యమైతే మనకు లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన ఫలితం మనకు లభిస్తుంది. అంత విశిష్టత ఈ కార్తీకమాసానికి ఉంది. అందుకని మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మనకి ఈ సంవత్సరం కార్తీకమాసం అనేది 2023 నవంబర్ 14వ తేదీ నుండి కార్తీక మాసం అనేది ప్రారంభమైంది.. డిసెంబర్ 12వ తేదీన మంగళవారంతో ఈ కార్తీకమాసం అనేది ముగుస్తుంది.ఈ కార్తీకమాసంలో మనం శివుని పూజిస్తాము. ఆ పరమేశ్వరుడికి ఎంత ఇష్టమైన మాసమే కార్తీకమాసం. అయితే ఈ మాసంలో శివుడనే కాదండి.. విష్ణుమూర్తి ని కూడా మనం పూజిస్తాము.
కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము. శివ కేశవులకి భేదం లేదని అంటారు.. అందుకని ఈ మాసంలో ఆ శివ కేశవులు ఇద్దరిని కూడా మనం పూజిస్తాము. అయితే కార్తీకమాసంలో పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం… ముందుగా అయితే కార్తీకమాసంలో కార్తీక స్నానాలు అనేవి చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిది..ఇంచుమించు ఉదయం 4:00 నుండి 5:00 లోపు చేయడానికి ట్రై చేయండి. మీకు వీలుంటే నది దగ్గర గాని చెరువు దగ్గర కానీ మీరు వెళ్లి స్నానాలు చేయొచ్చు.. మాకు అవి అందుబాటులో లేవని అనుకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు చెయ్యవచ్చు. ఈ మాసంలో పెట్టే దీపాలు ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలిగిన నింపుతాయి. మాస వారాలలో సోమవారానికి కూడా ప్రత్యేకత ఉంది.
ఈ కార్తీకమాసంలో ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసుకొని కృతిక నక్షత్రాలు ఉండగానే పూజగదిలో మరియు తులసి కోట దగ్గర రెండు చోట్ల దీపాలు పెడతారు. ఇలాంటి దీపాలు పెట్టే క్రమంలో మొదటి దీపం ఎక్కడ పెట్టాలి. పూజ గదిలో పెట్టాలా.. లేదా తులసి కోట దగ్గర పెట్టాలా.. అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. తులసి కోట దగ్గర దీపం పెట్టి ఆ తర్వాతే పూజ గదిలో దీపం పెట్టాలి. ఎందుకంటే తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం పూజగదిలో సాధారణంగా ఈ మాసంలో శివున్ని గాని అంటే శివుని ముందుగానే విష్ణు ముందుగానే దీపం పెడతాము… మన సాంప్రదాయంలో స్త్రీకే అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. లక్ష్మి నీళ్లు పోసి చక్కగా తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసమ్మకు పూజ చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలు పెట్టాలి. ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టాలి. మీ ఇష్ట దైవతను పూజించుకోవచ్చు.. కనుక కార్తీక మాసంలో ముందు తులసి కోట దగ్గర అనగా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టండి..
ఆ తర్వాత గడపకు పూజ చేసి గడపకు రెండు వైపులా దీపాలు పెట్టి చివర్లో పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేపగానే ఈ పని చేస్తే వారి జీవితం సర్వనాశనం అవుతుందని అదే దీనిని చూస్తే మాత్రం పూజలు చేయకపోయినా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. సనాతన భారతీయ ధర్మం ప్రకారం కార్తీకమాసంలో సూర్యుడు రాకముందే వేకువచ్చామునే నిద్రలేవాలి. కార్తీకంలో ఉదయాన్నే కార్తీక స్నానం చేయడం గోమాతను సేవించడం, దైవారాధన చేయటం వంటి మంచి పనుల వలన అశుభలు దూరం అవుతాయి. జీవితం శుభ్రంగా సమస్యలు లేకుండా ఉండేందుకు కార్తీకమాసంలో ఉదయం లేవగానే తులసి చెట్టును లేదా ఉసిరి చెట్టును దర్శించండి. కార్తీకమాసంలో మీరు పూజలు చేయకపోయినా సరే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తులసి లేదా ఉసిరి చెట్టును దర్శించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని సాధిస్తారు…