కొత్త రేషన్ కార్డుల గురించి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… కొత్త కార్డులు కావాలంటే ఇలా చేయండి..!

New Ration Card : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. ఇక మిగతా గ్యారెంటీ లకి సంబంధించి వాటికి దరఖాస్తులు తీసుకోవడం కూడా జరిగింది. ఎన్నికల టైం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకున్నారు… వీటిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను తీసుకోలేదు మొత్తం ఐదు గ్యారంటీలకు సుమారు కోటి పది లక్షల దరఖాస్తులు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హులకు గ్రామాలు వారు కూడా పంపిణీ చేయడం జరిగింది.. ఇక ఇవి కాకుండా చాలామంది రేషన్ కార్డులు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను పెట్టుకున్నారు.

ఐదు గారెంటీలకంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నవార సంఖ్య ఎక్కువగా వచ్చాయి. అంటే ప్రజల నుంచి మొత్తం 1.25 383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.. దీనిలో అభయస్థం పేరుతో ఐదు గ్యారంటీలకు వన్ కామా జీరో ఫైవ్ నైన్ వన్ సిక్స్ త్రీ సిక్స్ అప్లికేషన్లు వచ్చాయి. రేషన్ కార్డు ధరణి తదితరాల కోసం అదనంగా ఇంకో 19,92 ,747 అప్లికేషన్లు రావడం జరిగింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్నారు. గ్యారెంటీ పదకొండు రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటారట. దాన్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఇచ్చారు. ఇటువంటి కొలమానం లేకుండా పథకాలను అమలు చేస్తే నిధులు దుర్వినియోగం అయితాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.

ముందు ప్రభుత్వం చేసిన తప్పులను మేము చేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.రేషన్ కార్డు లేని వారికి త్వరలోనే రేషన్ కార్డులను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి నెల రెండో వారం నుండి లబ్ధిదారులు గుర్తించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మండల ఆఫీసర్ లో గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే రేషన్ కార్డు కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పారు. దీనికి రెండు రోజులు మాత్రమే గడువుంది. అంటే ఫిబ్రవరి 29వ తేదీ లోపు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎటువంటి పథకాలు వర్తించవని ఆయన తెలిపారు.