కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??

అంబానీస్‌ ఫ్యామిలీ అంటనే లగ్జరీకి పెట్టింది పేరు. ప్రపంచ బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే వస్త్రాలు, నగలు, వాచ్‌లు, విలాసవంతమైన బ్యాగులు నుంచి చెప్పులు, లిప్‌స్టిక్‌ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. ఇంక కార్ల గురించి వేరే చెప్పాలా! ఇప్పటికే వీరి కాంపౌండ్‌లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు.

స్పెషల్ కస్టమైజ్డ్ రోజ్ క్వా ర్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు ఇది. నీతా అంబానీ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియాలోనే మొట్టమొదటి అత్యంత లగ్జరీకారుగా దీనిని భావిస్తున్నారు. దీని స్టాండర్డ్‌ మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్‌కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.