గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త…11 వేల ఆర్థిక సాయం..!

Pregnant Women : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఈ పథకం మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ ద్వారా మహిళల కోసం నిర్వహించబడింది. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి మహిళకు అనేక రకాల ప్రయోజనాలను అందించనున్నారు. అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణీలకు 11వేల ఆర్థిక సాయంం అందజేయనున్నారు. ఇక ఈ పథకం మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో వర్తిస్తుందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు మూడు విడతలలో 11 వేల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గర్భిణీ మహిళలకు పంపిస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా మహిళలు వారి యొక్క పిల్లలను సక్రమంగా పోషించగలరని కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా ఈ ఆర్థిక సహాయంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, గర్భాదారణకు మందు మరియు వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి గర్భిణీ స్త్రీలు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Pregnant Women అర్హతలు

ఈ పథకం పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీ యొక్క వయసు కచ్చితంగా 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా గర్భిణీలు మరియు బాలింతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంగన్వాడి కార్యకర్తలు , అంగన్వాడి సహాయకులు ఆశ వర్కర్లు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి.

Pregnant Women : అవసరమైన పత్రాలు

ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా నిర్దిష్ట పత్రాలను కలిగి ఉండాలి. అవేంటంటే గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు , శిశు జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువు , పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఆదాయ ధ్రువీకరణ పత్రం , కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

Pregnant Women : రిజిస్ట్రేషన్..

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా https://pmmvy.wcd.gov.in లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఈ అప్లికేషన్ ధృవీకరణ తర్వాత ఈ పథకం కింద మీరు పొందే ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతుంది.

Pregnant Women : ఆఫ్ లైన్ లో ఎలా చేసుకోవాలి

ఈ పథకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా మీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన ఫామ్ అంగన్వాడి కేంద్రంలో తీసుకుని మీ సమాచారాన్ని నమోదు చేసి కావలసిన పత్రాలను జత చేయాలి. ఇక వాటిని సమర్పించినప్పుడు మీకు ఒక రసీదు ఇస్తారు. ఆ రిసీదు జాగ్రత్తగా ఉంచుకోండి.