తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు..

తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు, రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. కానీ ఏ రకమైన ఉత్పత్తులను మీ జుట్టును తాత్కాలికంగా నల్లగా చేసిన, రసాయనాలను ఉపయోగిస్తాయని అవి దీర్ఘకాలంలో తీరని నష్టాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా.. అందుకే సహజ సిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవడం ఉత్తమంటున్నారు నిపుణులు.. అందుకు ఒక మంచి రెసిపీని కూడా సూచించారు, దానికోసం పెద్దగా కష్టపడినక్కర్లేదు మన వంటింట్లో ఎప్పుడూ రెడీగా ఉండేది కాఫీ పొడి. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ నుండి రంగును తయారు చేసుకోవచ్చు, దీనికోసం రెండు పెద్ద చెంచాల కాఫీ పొడి ఒక కప్పు కండిషనర్ తీసుకోండి, ఈ రెండింటిని బాగా కలపండి తర్వాత ఆ పేస్ట్ ని జుట్టుకి బాగా పట్టించి దానిని గంట పాటు అలాగే ఉంచాలి. అప్పుడు మీ జుట్టూ నీటితో మాత్రమే కడగాలి. షాంపూ వాడకూడదు అలాగే మరో విధానంలో కాఫీ పొడి తీసుకొని, అందులో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి. ఇప్పుడు కూడా షాంపూ ని ఏ మాత్రం ఉపయోగించకూడదు. కాఫీ తెల్లని జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తుంది.

ఇది హెన్నా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. కాఫీ పొడిని జుట్టుకో సహజంగా పోషకాలను అందిస్తుంది. ఇది జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ జుట్టు సహజంగా కనపడేలా చేస్తుంది.కాఫీ పొడితో మీ జుట్టు చక్కని మెరుపు సంతరించుకుంటుంది. కాఫీ లోపలి నుండి జుట్టు మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది. దీంతో పాటు ఇది తలలో కొలోజిన్ను పెంచుతుంది. మెరిసే జుట్టు కావాలంటే కాఫీ పొడిని ఇలా వాడండి అంతేకాదు, కాఫీ జుట్టుకి మంచి కండిషన్ గా మీ జుట్టు లోపల నుండి తేమగా ఉండేలా కాఫీ పని చేస్తుంది. కాఫీలోనే గుణాలు మీ జుట్టులోని సిల్కీగా చేస్తాయి. ఈ సూచనలన్నీ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే, వీటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.