దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు.

Diabetes : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా షుగ‌ర్ ప‌రీక్ష‌లు ప‌ర‌గ‌డుపున చేస్తారు. అలాగే మ‌ర‌లా ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌రువాత చేస్తారు. ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు సాధార‌ణంగా మ‌నం ఆ ముందు పూట తీసుకున్న ఆహారంపై ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌నం అన్నం తీసుకోకుండా చ‌పాతీ,

పుల్కా వంటి వాటిని తీసుకుంటే షుగ‌ర్ స్థాయిలు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు ఫ‌లితాలు వ‌స్తాయి. అదే స్వీట్స్, అన్నం వంటి వాటిని తీసుకుంటే షుగ‌ర్ ఎక్కువ‌గా ఉన్నట్టు ఫలితాలు వ‌స్తాయి. షుగ‌ర్ అదుపులో ఉంటే షుగ‌ర్ వ‌చ్చి కాలం అయిన‌ప్ప‌టికి శ‌రీరంలో అవ‌య‌వాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి. అదే షుగ‌ర్ ఎక్కువ‌గా ఉంటే షుగ‌ర్ వ‌చ్చి త‌క్కువ కాలం అయిన‌ప్ప‌టికి అవ‌య‌వాలు ఎక్కువ‌గా దెబ్బ‌తింటాయి. అయితే ఇలా ఆహారాన్ని తీసుకోవ‌డానికి ముందు, ఆహారం తీసుకున్న త‌రువాత చేసిన ర‌క్త ప‌రీక్ష‌లను బ‌ట్టి షుగ‌ర్ ను అంచ‌వేయ‌డానికి బ‌దులుగా మూడు నెల‌ల‌కు ఒక‌సారి హెచ్ బి ఎ1సి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ర‌క్త‌ప‌రీక్ష‌న్ని బ‌ట్టి షుగ‌ర్ మ‌నం మ‌రింత చ‌క్క‌గా అంచ‌నా వేయ‌వ‌చ్చు.

ఈ హెచ్ బిఎ1సి ఫ‌లితాలు 6 నుండి 7 లోపు షుగ‌ర్ అదుపులో ఉన్నట్టు అర్థం. అదే 6 కంటే త‌క్కువ‌గా ఉంటే షుగ‌ర్ లేన‌ట్టే భావించాలి. అదే విధంగా 8 నుండి 10 లోపు వ‌స్తే షుగ‌ర్ కొద్దిగా ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అర్థం. 10 దాటి వ‌స్తే షుగ‌ర్ అస్స‌లు అదుపులో లేద‌ని అర్థం. ఈ హెచ్ బిఎ1సి ఫ‌లితాలు 6 క‌న్నా త‌క్కువ‌గా రావాల‌న్నా, డ‌యాబెటిక్ పేషెంట్స్ నాన్ డ‌యాబెటిక్ పేషెంట్స్ గా మారాల‌న్నా ముఖ్యంగా మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవాలి. షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఎక్కువ సార్లు తిని ఎక్కువ మందులు వేసుకోవ‌డానికి బ‌దులుగా రోజుకు రెండు సార్లు తిని ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే షుగ‌ర్ చాలా బాగా అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవ‌లం నీటిని తాగుతూ ఉండాలి. త‌రువాత 250 నుండి 300 ఎమ్ ఎల్ వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఒక గంట తరువాత రెండు పుల్కాల‌ను ఎక్కువ కూర‌తో తీసుకోవాలి. ఒక క‌ప్పు పెరుగును కూడా తీసుకోవ‌చ్చు. ఇక 4 గంట‌ల‌కు కొబ్బ‌రి నీళ్ల‌ను లేదా ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇక సాయంత్రం 6 గంట‌ల లోపు నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను, పండ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఒక గంట వాకింగ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ చాలా బాగా అదుపులోకి వ‌స్తుంది. హెచ్ బిఎ1 సి లో ఫ‌లితాలు 6 లోపే వ‌స్తాయి. ఈ విధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.