పునీత్ రాజ్ కుమార్ సీసీ టీవీ ఫుటేజ్.

ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. శుక్రవారం ఉదయం ఇంటిలో జిమ్‌ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.పునీత్ రాజ్‌ కుమార్ 1975 మార్చి 17న జన్మించారు. ఇప్పటి వ‌ర‌కు 29 సినిమాల్లో న‌టించారు. వసంత గీత, భాగ్యవంత, ఏడు నక్షత్రాలు, భక్తప్రహ్లాద, యరివాను వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

https://youtu.be/dLSF1i_Ca_I

బెట్టడా హువు చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఈయ‌న్ని క‌న్నడ సినీ ప‌రిశ్రమలో ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని పిలుస్తుంటారు.క‌న్నడ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్‌కుమార్‌. ఐదేళ్ల వ‌య‌సులోనే ఆయ‌న సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు. కన్నడ లెజండరీ యాక్టర్ రాజ్‌కుమార్ తనయుడుగా శాండల్‌వుడ్‌లోకి పునీత్ రాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. పునీత్ రాజ్ కుమార్ మంచి డ్యాన్సర్‌ కావడంతో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది