మలబద్దకంతో బాదపడుతున్నారా.. లేచిన వెంటేనే ఇలా చేయండి చాలు..!

ఈ రోజుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. అలాంటి వాటిలో మలబద్దకం కూడా ఒకటి. ఈ సమస్య పెద్ద వారికి మాత్రమే కాదు చిన్న వయసు వారికి కూడా వస్తుంది. అయితే అది చిన్న సమస్య అనికొందరు అనుకుంటారు. కానీ అది చిన్న సమస్య అయితే అస్సలు కాదు. దాని వల్ల ఇంకా చాలా పెద్ద సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే మలబద్దకంను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ లేచిన వెంటనే ఈ పనులు చేస్తే మాత్రం కచ్చితంగా మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.

హైడ్రేషన్ గా ఉండాలి..

డీ హైడ్రేషన్ వల్ల కూడా మలబద్దకం సమస్య వస్తుంది. కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే గ్లాసెడు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే మలం మృదువుగా అవుతుంది. దాంతో పాటు పేగు కదలికలు కూడా సులభతరం అవుతాయి. కాబట్టి పేగుల్లో మలం ఈజీగా కదులుతుంది. ఇక అజీర్ణ సమస్యలు ఉంటే కూడా దాన్ని తగ్గించుకునేందుకు కార్బోనేటేడ్ పానీయాలకు బదులుగా తాజా రసం త్రాగాలి. నిత్యం నీళ్లు, జ్యూస్ లు తాగుతూ ఉండాలి.

వ్యాయామాలు చేయాలి..

ఈ రోజుల్లో బాడీకి పని చెప్పుకుండా ఉంటారు చాలామంది. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుండిపోతుంటారు. అలాంటి వారికి కచ్చితంగా మలబద్దకం లాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని తగ్గించుకునేందుకు ఉదయం పూట వాకింగ్, రన్నింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. అలా చేయడాన్ని రోజూ అలవాటు చేసుకోవాలి. దాంతో ఈజీగా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

పొత్తి కడుపు మసాజ్..

పొత్తికడుపుకు మసాజ్ చేయడం వల్ల స్టూల్ ట్రాన్సిట్ సమయాన్ని తగ్గిస్తుందని ఇప్పటికే చాలా సర్వేలు తెలిపాయి. ఉదయం పూట మలబద్దకంగా అనిపిస్తే మాత్రం వెంటనే మీ పొత్తి కడుపుపై సులభతరంగా అనిపించే మసాజ్ ను చేసుకోవాలి. దాని వల్ల చాలానే ఉపశమనం లభిస్తుంది.

ప్రోబయోటిక్స్ తినండి

ప్రోబయోటిక్స్ ను తింటే ఈజీగా మలబద్దకం సమస్యలు తగ్గిపోతాయి. ప్రోబయోటిక్స్ అంటే సహజంగా సంభవించే ప్రత్యక్ష, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. దీర్ఘకాలిక మలబద్దకం సమస్యలతో బాదపడుతున్న వారు తరచూ దాన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా అసమతుల్యత తగ్గిపోతుంది.

Add Comment