రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

సాధారణంగా ఎవరైనా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతుంటారు. రాగి ఉంగరాన్ని ధరించే సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. జ్యోతిషశాస్త్రంలో, రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగిని సూర్యుడు, అంగారకుడి లోహంగా పరిగణిస్తారు. రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ఉంగరాలు, బ్రాస్లెట్‌ వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు చాలావరకు తగ్గుతాయి. అంతేకాదు.. పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. ఆర్థరైటిస్‌ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాగి ఆభరణాలు ధరించడం వలన సూర్య,అంగారక దోషాలు తొలగిపోతాయి. ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్య దోషం తొలగిపోతుంది. సూర్యునితో పాటు, అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని కూడా తాగవచ్చు. వాస్తు దోషాలు తొలగిపోతాయి – వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం, శాంతిని కాపాడతాయి. దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే రాగి నాణేన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు.