శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయను ఇంటికి తీసుకెళ్తే జరిగేది ఇదే

శివ అనే పేరులోనే ప్రత్యేకమైనటువంటి అంతరార్థం ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. హిందూ పురాణాల ప్రకారం సోమవారం అనేది ఆ శివయ్యకు ప్రత్యేకమైనటువంటి రోజు. ‘శి’ అంటే శాశ్వతానందం. మగవారి యొక్క శక్తి అని అర్థం ‘వ’ అంటే మహిళల యొక్క శక్తి అని అర్థం. ఒక వ్యక్తి శివుని లింగ రూపంలో పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత మైనటువంటి స్థాయిలకు చేరుతూ ఉంటారని మన వేదాలు వివరిస్తున్నాయి.శివుడు భక్తుల కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల లోనూ చేయకూడదు. శివుడికి బోలా శంకరుడు, పరమ శివుడు, ముక్కంటి, అర్థనారీశ్వరుడు, అనేటటువంటి పలురకాలైన నామాలు ఉన్నాయి. అయితే శివాలయం, వైష్ణవాలయం రెండింటికీ చాలా వ్యత్యాసం వుంటుంది. సమర్పించే అటువంటి కానుకలు కూడా వేరుగా ఉంటాయి. ఎందుకంటే శివుడు ఎప్పుడూ కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. విష్ణువు మోక్షాన్ని ప్రసాదించే వాడు.

శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి ఎట్టి పరిస్థితులలోనూ తీసుకురాకూడదు, కారణం ఏమిటంటే శివుడి లింగాభిషేకం జరిగేచోట ఎప్పుడూ కుడివైపు చండీశ్వరుడు అనేటటువంటి చండీశ్వరుడు అనే గానం అక్కడ కొలువై ఉంటుంది. అయితే పురాణ ప్రతీతి ప్రకారం చూసుకుంటే సతీదేవి ఆహుతి అయినప్పుడు, దక్షప్రజాపతి మీద యుద్ధానికి వెళ్లినప్పుడు, చండీశ్వరుడు తన తొడపై ఉంటాడు. అందుకే శివుడి గుడి కి ఏదైనా మనం సమర్పిస్తే, అదే సగభాగం చండీశ్వరుడు కి వెళుతుంది. అందుకే మనం కొబ్బరికాయలు ఇస్తే అదే సగం శివుడికి మిగితా సగం చండీశ్వరుడు కి వెళుతుంది.

అందుకే మనం అక్కడి నుండి కొబ్బరి చిప్పను తీసుకురాకూడదు. ఎప్పుడైతే శివుడు, గణపతి, అమ్మవారు, విష్ణువు సూర్యుడు ఇలాగా ఎవరితోనైనా కలిసిన గుడి ఉంటే అక్కడ కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే శివుడు భూత లింగేశ్వర రూపంలో ఉంటాడో అంటే శివుడు మాత్రమే కొలువై ఉండేటటువంటి గుడి ఏదైతే ఉంటుందో, అక్కడ మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది ఇంటికి తెచ్చుకోకూడదు. ప్రతి దేవాలయాలలో చేసేటటువంటి ప్రదక్షిణ వేరు శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలి, అలా చేయడం ద్వారా మనం ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనేది, పురాణాలలో చాలా సుస్పష్టంగా తెలపబడింది.

శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుండి, మనకు ఎడమపక్క గా బయలుదేరి, గర్భాలయానికి పక్కనున్న సోమసూత్రం అంటే శివుడి అభిషేక జలం బయటకు వెళ్ళే అటువంటి మార్గం వరకు వెళ్లి, వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడి నుండి వెనుతిరిగి అప్రదక్షణంగా మరల ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు లెక్క. ఈ విధమైన ప్రదక్షణలు శివునికి భక్తులు తమ శక్త్యానుసారం బేసి సంఖ్యలు అంటే 3,5,7,9, ఈ విధంగా చేయవచ్చు. శివ ప్రదక్షిణలో సోమ సూత్రాన్ని దాటకూడదు అనేది ప్రధానమైన నియమం. అలా ఎన్ని ప్రదక్షిణలు చేసినా కూడా ఒక ప్రదర్శన కిందికే వస్తుంది, కాబట్టి ఈ సారి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు తప్పక పాటించాలి. మంచి ఫలితాలను పొందుకోండి. శుభం భూయాత్..