అప‌ర కుబేరుడు అదానీ ఏడాదికి తీసుకునే జీతం ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

Gowtham Adani : దేశంలోనే రెండో అత్యంత సంప‌న్నుడు గౌత‌మ్ అదానీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న అన‌తికాలంలోనే భారీగా సంపాదించి అప‌ర కుబేరుల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న సంప‌ద విలువ రూ.7.14 ల‌క్ష‌ల కోట్లు కాగా ఈయ‌న క‌న్నా ముందు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుబేరుల జాబితాలో దేశంలో మొద‌టి స్థానంలో ఉన్నారు. అంబానీ ఆస్తి విలువ రూ.9.54 ల‌క్ష‌ల కోట్లు కాగా..

ఇప్పుడు ఈ ఇద్ద‌రూ త‌మ కంపెనీల నుంచి ఏడాదికి తీసుకుంటున్న జీతాల విలువ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ముకేష్ అంబానీ త‌న కంపెనీల నుంచి ఏడాదికి రూ.15 కోట్ల జీతం తీసుకుంటున్నారు. అయితే ఈయ‌న కోవిడ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న జీతాన్ని అంబానీ ట్ర‌స్ట్ కోసం విరాళంగా అందిస్తున్నారు. త‌న జీతం మొత్తం విరాళాల‌కే వెళ్తోంది. మ‌రోవైపు గౌత‌మ్ అదానీకి చాలా కంపెనీలు ఉండ‌గా ఆయ‌న కేవ‌లం 2 కంపెనీల నుంచే జీతం తీసుకుంటున్నారు. గౌత‌మ్ అదానీ త‌న అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ నుంచి ఏడాదికి రూ.2.19 కోట్ల వేత‌నం పొందుతున్నారు.

అలాగే అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజ‌డ్ లిమిటెడ్ నుంచి గౌత‌మ్ అదానీ ఏడాదికి రూ.6.8 కోట్ల వేత‌నం తీసుకుంటున్నారు. మొత్తం క‌లిపి గౌతమ్ అదానీ త‌న కంపెనీల నుంచి ఏడాదికి రూ.9.26 కోట్ల వేత‌నం తీసుకుంటున్నారు. అయితే ఏ ర‌కంగా చూసినా కూడా ఇత‌ర కార్పొరేట్ కంపెనీల య‌జ‌మానుల వేత‌నంతో పోలిస్తే గౌత‌మ్ అదానీ తీసుకుంటున్న వేత‌నం చాలా త‌క్కువే. దీనిపై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ప్ప‌టికీ అంత త‌క్కువ వేత‌నం తీసుకుంటుండ‌డంపై వారు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.