అశ్వగంధ వాడుతున్నారా.? అయితే భార్యాభర్తలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!!

సాధారణంగా డాక్టర్లు ఎలాంటి జబ్బు చేసిన లేదంటే దెబ్బ తగిలినా కూడా పెన్సిల్ ఇంజక్షన్ చేస్తారు. అలోపతిలో పెన్సిల్ ని ఎలా వాడుతారో ఆయుర్వేదంలో ఈ అశ్వగంధ ను కూడా అలాగే వాడతారు. అశ్వగంధ ప్రతి పార్ట్ కూడా ఆరోగ్య దాయకంగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధను ఆడవారు మాత్రమే తీసుకోవాలని అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆడవారికంటే కూడా అత్యధికంగా అశ్వగంధ మగవారికి ఉపయోగమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవారిలో ఉండే పలు రకాల సమస్యలకు వారి ఆరోగ్యంలో కాపాడడంలో అశ్వగంధ కీలకపాత్ర పోషిస్తుంది. అశ్వగంధ వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు పూర్తిగా దూరమవుతాయి. మలబద్ధకంతో బాధపడుతున్న వారు రెండు రోజులు కంటిన్యూగా అశ్వగంధ తీసుకుంటే శాశ్వతంగా పూర్తిగా మలబద్దక సమస్యకు బై చెప్పవచ్చు..

ఎదిగే పిల్లలకు అశ్వగంధ ఇవ్వాలి. ఎదుగుదలలో చాలా క్రియాశీలకంగా అశ్వగంధ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎదుగుదలలో కీలకంగా పని చేస్తుంది. కండరాలు ప్రతిష్టంగా చేయడంలో పాటు మజిల్స్ పెంచడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఔషధ గుణం ఏంటంటే దీన్ని వాడడం వల్ల అద్భుతమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలకు ఈ మధ్య రోజుల తరబడి జనాలు బాధపడుతున్నారు. అందుకే వారికి అశ్వగంధ ఇవ్వాలంటే ఆహారంలో కలిపి వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరంలో ప్రతిరోజు ఏదో ఒక కారణం వల్ల కొన్ని కణాలు మృతి చెందుతూ ఉంటాయి. ఒకవైపు కణాలు మృతి చెందుతూ ఉంటే మరోవైపు కొత్త కణాలు పుట్టుక రావాలి.

కొత్త కణాలు పుట్టుకకు అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఆపరేషన్ చేసినప్పుడు కొత్త కణాలు పుట్టుక రావాల్సి ఉంటుంది. అప్పుడు అశ్వగంధలు తప్పకుండా వాడాలి. మూడు గ్రాముల అశ్వగంధ చూర్ణంలో వేడిపాలలో బాగా కలిపి తీసుకోవాలి. ఆ పాలను తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న టౌన్ లో కూడా ఆయుర్వేద స్టోర్లు ఉన్నాయి. ఆయుర్వేద స్టోర్స్ లో కచ్చితంగా అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ లేహ్యం లభిస్తుంది. రుచికి కాస్త ఇబ్బందిగా ఉన్న ఆరోగ్యానికి అద్భుత ఔషధం. కనుక ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా కాకుండా కనీసం వారంలో ఒక్కసారి లేదా నెలలో రెండు సార్లు మూడు సార్లు అయినా తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..