ఆపరేషన్ టైంలో డాక్టర్లు గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తారు.. ఎందుకో తెలుసా?

డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడో లేక సర్జరీ చేసేటప్పుడో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు. నీలం రంగు దుస్తులు కూడా ధరిస్తారు. కానీ ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులే ధరిస్తారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వైద్యో నారాయణో హరి అని అంటారు. వైద్యుడు ప్రాణాలు కాపాడే భగవంతుడని అంటారు. ఆర్ఎంపీ డాక్టర్ నుంచి ఎంబీబీఎస్, ఎఫ్ఫార్సీఎస్ లండన్ వరకూ డాక్టర్లు తమ జీవితాలను ప్రజల ఆరోగ్యం కోసం అంకితం చేస్తారు. ఒక హిందువు రాముడ్ని, కృష్ణుడిని, శివుడ్ని మొక్కినట్టు, ఒక క్రైస్తవుడు జీసస్ ని ప్రార్థించినట్టు, ఒక ముస్లిం అల్లాని ఆరాధించినట్టు.. మతాలకు అతీతంగా అందరూ కలిసి మొక్కేది ఆ డాక్టర్ కే. డాక్టర్ వృత్తి ఎంతో గొప్పది. ఆపరేషన్లు, సర్జరీలు అంటూ నిత్యం బిజీ బిజీగా ఉంటారు. ఆపరేషన్లు అంటే గుర్తొచ్చింది..

అసలు డాక్టర్లు ఆపరేషన్లు, సర్జరీలు చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు గానీ ఆకుపచ్చ రంగు దుస్తులు గానీ ధరిస్తారు. ఎందుకో తెలుసా? నిజానికి 20వ శతాబ్దానికి ముందు వైద్యులు తెల్లని యూనిఫామ్ ధరించేవారు. అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో ఒక పలుకుబడి ఉన్న డాక్టర్.. సర్జరీ చేసే వారి కళ్ళకు ఆకుపచ్చ రంగు దుస్తులు అయితే ఉత్తమం అని సూచించారు. 1998లో వచ్చిన టుడేస్ సర్జికల్ నర్స్ అనే ఆర్టికల్ లో ఈ విషయం గురించి చెప్పబడింది. అయితే దీని ఆధారంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఆపరేషన్ థియేటర్ లో బాగా కనిపించడం కోసం ఆకుపచ్చ రంగులు ధరిస్తారు. ఆకుపచ్చ అనేది కలర్ వీల్ లో ఎరుపు రంగుకి వ్యతిరేకం. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

రెండు కారణాల వల్ల వైద్యులు మెరుగ్గా చూసేందుకు ఆకుపచ్చ రంగు అనేది ఉపయోగపడుతుంది. మొదటిది సర్జరీ సమయంలో రోగి యొక్క అంతర్గత అవయవాలను లైక్ ఎర్రని వస్తువులను చూసిన తర్వాత నీలం లేదా ఆకుపచ్చ రంగు చూసినప్పుడు కంటిచూపు మెరుగవుతుంది. మెదడు ఒకదానితో ఒకటి రంగును అర్థం చేసుకుంటుంది. ఒకవేళ సర్జన్ ఎరుపు, పింక్ రంగులను తదేకంగా చూసినట్లయితే.. అతను షాక్ కి గురయ్యే ప్రమాదం ఉంది. మెదడులో ఉన్న ఎరుపు సిగ్నల్ వాస్తవానికి మసకబారుతుంది. దీని వల్ల మనిషి శరీరంలోని సూక్ష్మ నైపుణ్యాలను చూడడంలో కష్టమవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ లో విజన్ గురించి చదువుకున్న జాన్ వెర్నర్ అనే సైకాలజిస్ట్ చెప్తున్న దాని ప్రకారం.. ఆకుపచ్చ రంగుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండడం.

వల్ల ఎరుపు రంగులో ఉన్న వైవిధ్యాలు గుర్తించే స్థాయిలో వైద్యుల కళ్ళు మరింత సున్నితంగా తయారవుతాయి. ఇది సర్జరీ చేయడానికి బాగా సహకరిస్తుంది. ఇక ఎరుపు రంగుని అలానే చూడడం వల్ల.. తెల్లని ఉపరితలాల మీద ఇతర రంగుల నుంచి దృష్టి మరలుస్తుంది. వేరే ఏ రంగులను గుర్తుపట్టలేము. ఆ సమయంలో ఆకుపచ్చ రంగుని చూస్తే కంటిచూపు రిఫ్రెష్ అవుతుంది. తెలుపు రంగు లైటులో ఆకుపచ్చ, ఎరుపు రంగుతో సహా ఇంద్రధనస్సులో ఉండే అన్ని రంగులూ ఉంటాయి. అయితే ఎరుపు రంగు వర్సెస్ ఆకుపచ్చ రంగు పోటీ పడినప్పుడు.. ఆకుపచ్చ ఎరుపు రంగుని ఎలాంటి మసక లేకుండా చూసేందుకు సహాయపడుతుంది.

ఆపరేషన్ సమయంలో లైట్ స్పెక్ట్రమ్ లో ఆకుపచ్చ, నీలం రంగులు ఎరుపు రంగుకు వ్యతిరేకం. కాబట్టి సర్జన్ యొక్క అటెన్షన్ అనేది పక్కకు వెళ్లకుండా ఉంటుంది. ఎరుపు రంగు మీద ఎక్కువ ఫోకస్ ఉండేలా ఈ ఆకుపచ్చ, నీలం రంగులు సహాయపడతాయి. ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులు.. సర్జన్ యొక్క కంటిచూపును పెరుగుపరుస్తాయి. సూక్ష్మంగా చూసేందుకు, ఎరుపు రంగు పట్ల ఎక్కువ సున్నితంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల.. సర్జరీ చేసే సమయంలో కళ్ళకు విశ్రాంతి కలుగుతుంది. అయితే ప్రపంచంలోనే మొదటి సర్జన్ గా చెప్పబడుతున్న ఢిల్లీలోని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ దీపక్ నైన్ చెప్తున్న దాని ప్రకారం.. ఆయుర్వేదంలో సర్జరీ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తుల ఉపయోగం గురించి చెప్పబడిందని రాశారు.

అయితే సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు.. నీలం, తెలుపు రంగు దుస్తులు కూడా ధరిస్తారు. అయితే నీలం, తెలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు రక్తపు మచ్చలు గోధుమ రంగులో కనిపిస్తాయి. అందుకే ఆకుపచ్చ రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అంటే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తున్నారు గానీ 1914కి ముందు తెలుపు రంగు దుస్తులు ధరించేవారు. 1914లో ఒక డాక్టర్ బాబు.. ఏయ్ అందరూ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి’ అని డాక్టర్లందరికీ సూచించారు. అప్పటి నుంచి ఆకుపచ్చ రంగు డ్రెస్ కోడ్ అనేది బాగా పాపులర్ అయ్యింది. అయితే కొంతమంది వైద్యులు నీలం రంగు దుస్తులు ధరిస్తారు. అదండీ విషయం.. డాక్టర్లు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి కారణం ఇదే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.