ఈ 5 రకాల గింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? రూపు చిన్నదైనా పోషకాలు ఎన్నో.!

మన ఆహారపదార్థాల్లో అన్నిటికీ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది. అలా గింజలకి కూడా ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. శరీరానికి, చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఈ గింజల వల్ల దూరం అవుతాయి. అంతేకాకుండా డైట్ అనుసరించే వారికి ఎంతో మంది డైటీషియన్లు కూడా వాళ్ళ డైట్ ప్లాన్ లో గింజలను కచ్చితంగా ఉండేలా చూసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. కొన్ని గింజల వల్ల కలిగే ఉపయోగాలు ఇవే.

*గుమ్మడికాయ గింజలు : సాధారణంగా కొంతమంది గుమ్మడికాయని వంటలలో వాడుతారు. కానీ గింజలను మాత్రం పారేస్తారు. గుమ్మడికాయ గింజలలో ప్రోటీన్స్, ఒమెగా త్రీ, ఒమెగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయట. అంతేకాకుండా ఐరన్, క్యాల్షియం, ఫోలేట్,బెటా కెరోటిన్ కూడా ఉంటాయట. వీటివల్ల శరీరానికి విటమిన్ ఏ లభిస్తుందట.

Pumkin Seeds, कद्दू के बीज in Delhi , Novelty Meena Bazar | ID: 15345967233

*పొద్దుతిరుగుడు గింజలు : ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయట. విటమిన్ ఇ కూడా ఉంటుందట. దాని వల్ల వ్యాధులు రావట. అలాగే బరువు తగ్గాలనుకొనే వారు ఇవి తప్పకుండా తీసుకోవాలట. ఎందుకంటే ఈ గింజల్లో ఫ్యాట్ తగ్గించే గుణం ఉంటుందట. అలాగే గుండెకు, చర్మానికి కూడా ఎంతో మంచిదట.

పొద్దు తిరుగుడు' గింజల్ని తినటం వల్ల అనేక ప్రయోజనాలు.. – dailyindia

*కలోంజి :వీటిలో మొటిమలను తగ్గించే గుణం ఉంటుందట. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తరచుగా కలోంజి గింజలని తీసుకుంటే డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుందట. ఆస్తమా తగ్గుతుందట. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ గింజలు ఉపయోగపడతాయట. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయట. ఈ గింజలు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే మూత్రపిండాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉండవట.

kalonji can cure many chronic decease

* అవిసె గింజలు :అవిసె గింజలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అవిస గింజలు క్యాన్సర్ నుండి కూడా దూరంగా ఉంచుతాయట.

Buy Pmw® - Grade A Non Roasted - Flax Seeds - Alsi - Alasi - Linseed -  Avisa Ginjalu - 1Kilo - Loose Packed at best price in India - EatGourmet

*నువ్వుల గింజలు : నువ్వు గింజలు తీసుకుంటే చర్మానికి ఎంతో మంచిదట. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. నువ్వుల గింజలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

SESAME SEEDS / NUVVULU - Sync with Nature