ఉదయాన్నే మడమ నొప్పి ఉంటె వెంటనే ఇలా చెయ్యండి…

ఈ రోజుల్లో మడమ దగ్గర నొప్పి అనేది చాలా మందికి వస్తూ వుంటుంది. మడమ దగ్గర వాపు అలాంటిది ఏమీ ఉండదు కానీ నడిచేటప్పుడు విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది. అలాగే వీరు మెట్ల పైకి కిందకి నడవలేరు. కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నడవాలి అంటే మాత్రం ప్రాణం పోతుంది. ముఖ్యంగా రాత్రిపూట పడుకుని పొద్దున లేచి కాలు కింద పెట్టాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఈ సమస్య ఉన్న వారు ఒకసారి ఎక్స్ రే చేయించండి. దాంట్లో కాల్ kenya’s పర్ అని ఒకటి ఫామ్ అవుతుంది. అంటే మనం ఎక్స్రే తీయించుకొని చూస్తే దాంట్లో ఆ మడమ దగ్గర ,మడమ దగ్గర నుండి ఒక ముల్లు లాగా వచ్చి ఉంటుంది, దీన్నే కాల్ kenya’s ఫర్ అంటారు. మనం నడిచినప్పుడు ఎడ్జ్ ఏదైతే ఉంటుందో , నేల కి మరియు ఆ ముళ్ళు కి మధ్యలో మన కాలు లో ఉండే మజిల్స్ పడతాయి. ఇలా పడేసరికి నేలకేసి ఆ ముళ్ళు గుచ్చుతుంది. ఇలా జరిగినప్పుడు విలవిల లాడే లాగా నొప్పి అనేది రావడం జరుగుతుంది.

ఇది ఎందుకు జరుగుతుందంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన బాడీ లో క్యాల్షియం ఎక్కువగా పోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకే బోన్ అనేది ఆ ప్రదేశంలో త్వరగా అరిగిపోతుంది. అందుకని ఈ ప్రాబ్లం రాకుండా చూడాలంటే ముందు నుంచే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అలాగే మన బాడీ లో క్యాల్షియం తగ్గకుండా చూసుకోవాలి. కేవలం క్యాల్షియం ఒక్కటే చూసుకుంటే సరిపోదు క్యాల్షియం మన బాడీలో డిపాజిట్ దానిని బోన్స్ కి అటాచ్ చేయడానికి వేరే పదార్థాలు కావాల్సి ఉంటుంది. అందుకని ఈ ప్రాబ్లం ఉండే అధిక బరువు ఉంటే ముందుగా బరువు తగ్గించుకోండి, మీరు ఎంత అయితే ఎక్స్ట్రా వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ తగ్గించుకోవాలి. అలాగే మెత్తగా స్పాంజిలాగా వుండే చెప్పులను వాడండి, దీనివల్ల మీ మజిల్స్ పై ఎక్కువగా ప్రెజర్ అనేది పడకుండా ఉంటుంది.

అలాగే పెయిన్ అనేది కాస్త మేనేజ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఒక బకెట్ నిండా వేడి నీళ్లను తీసుకుని దాంట్లో ఎప్సం సాల్ట్ వేయాలి, ఇలా వేసిన తర్వాత మీరు చైర్ లో కూర్చుని మీ కాళ్లను బకెట్ లో పెట్టుకోవాలి. దీనివల్ల కూడా పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంకా బాగా సివియర్ గా పెయిన్ అనిపిస్తే కనుక ఇక మన ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్యూబ్స్ తీసుకుని రుద్దండి, ఇలా చేయడం వల్ల కాస్త టెంపరరీగా రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే మీకు జిల్లేడు పూలు దొరికినట్లు అయితే వాటిని తీసుకుని వాటిని కొద్దిగా పసుపు వేసి మెత్తగా నూరి పేస్టులాగా చేసుకోండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మడమ దగ్గర ఈ పేస్టుని అప్లై చేయండి, ఇలా పెట్టిన తర్వాత కాలు పూర్తిగా ఆరు పోయేవరకు కాలు కింద పెట్టకూడదు. ఇలా కదలకుండా కూర్చొని గలిగితే మీ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది.