ఎటువంటి మొండి పెరలాసిస్ అయినా అతి సింపుల్ గా తగ్గించే మెడిసిన్.

ఉదయాన్నే ఇవి తింటే 40 కాదు 80 ఏళ్ళు వచ్చినా యంగ్ గా కనిపిస్తారు…!జీవి నియంత్రణ వ్యవస్థ పగ్గాలన్నీ మెదడు దగ్గరే ఉంటాయి. మెదడు ఆదేశిస్తేనే.. కాలు కదులుతుంది, చేయి ఊగుతుంది, ఆలోచన ముందుకు సాగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమ‌త్తంగా ఉండాలి.

ఈ క్ర‌మంలోనే ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు మ‌న శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు ముఖానికి ఒక వైపు స్ప‌ర్శ స‌రిగ్గా ఉండ‌దు. ఒక వైపును స‌రిగ్గా క‌దిలించ‌లేరు. అలాగే ఒక వైపు ఉండే ముఖంపై చ‌ర్మం అంతా సాగిన‌ట్లు అవుతుంది. ముఖాన్ని రెండు వైపులా స‌రిగ్గా క‌దిలిస్తే.. ప‌క్షం వ‌చ్చేది.. రానిదీ తెలుసుకోవ‌చ్చు.. ఒక వైపు ముఖాన్ని క‌దిలించ‌క‌పోతే.. వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాలి. త‌క్ష‌ణ‌మే వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.

కొంద‌రికి అప్పుడప్పుడు శరీరంలో కేవ‌లం ఒకే వైపు స్ప‌ర్శ లేకుండా అవుతుంది. ఆ స‌మ‌యంలో కొంద‌రు శ‌రీరంలో ఒక ప‌క్క భాగాన్ని (చేతులు, కాళ్లు కూడా) కదిలించ‌లేక‌పోతారు. ఇలా గ‌న‌క ఎవ‌రికైనా అనిపిస్తుంటే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి. ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు కొంద‌రికి మాట కూడా స‌రిగ్గా రాదు. అస్ప‌ష్టంగా మాట్లాడుతుంటారు. ఇలా గ‌న‌క జ‌రుగుతుంటే.. వెంట‌నే స్పందించి.. డాక్ట‌ర్‌ను క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవాలి.