కంటి మసక తగ్గి కంటి చూపు పెరుగుతుంది. ఈ టిప్స్ పాటించండి చాలు.

టీనేజ్ లో పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అందుకే వాళ్ళు ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్స్ తింటున్నారు కాబట్టి వారంలో రెండు రోజులు వాళ్ళ ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్న ఐదు రోజులు మాత్రం మంచి ఆహారాన్ని అందించాలి ఈ టీనేజ్ లో పిల్లల పెరుగుదల ఉంటుంది. కంటి చూపు తగ్గేది ఇప్పుడే….

బరువు పెరిగేది ఇప్పుడే, ముఖంపై మొటిమలు వచ్చేది ఇప్పుడే , అందుకే మంచి ఆహారాన్ని ఇవ్వాలి. కంటిచూపు కి ఉదయం పూట క్యారట్, బీట్రూట్, టమాట, మునగాకు మిక్సి చేసుకోవాలి. రసం తీసి ఎండు ఖర్జూర పొడి వేసి తాగాలి. ఉదయం టిఫిన్ పచ్చి కొబ్బరి నానబెట్టిన పెసర్లు వేరుశనగలు తినాలి.

మధ్యాహ్నం అన్నం వండేటప్పుడు దాంట్లో సోయా గింజలు వేసి వండాలి. లేదా రాజ్మా గింజలు వేసి వండాలి. ఆకుకూరలు బాగా పెట్టాలి. సాయంత్రం పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు బాదం పప్పు కలిపి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు బాగా బలంగా పెరుగుతారు.