కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

Kidneys : మ‌న శ‌రీరంలో కిడ్నీలు చాలా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరంలో చేరే వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అందువ‌ల్ల ఇవి నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. క‌నుక వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు స‌హాయ ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

పాల‌కూర‌లో విట‌మిన్లు ఎ, సి, కె, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫోలేట్‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక త‌ర‌చూ పాల‌కూర‌ను తింటుండాలి.పైనాపిల్ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి కిడ్నీల‌ను ర‌క్షిస్తుంది. కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.క్యాప్సికంలో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కాలిఫ్ల‌వ‌ర్ లో ఫోలేట్‌, విట‌మిన్ సి, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు స‌హాయ ప‌డ‌తాయి.వెల్లుల్లిలో పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్ లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వెల్లుల్లిని త‌ర‌చూ తీసుకుంటే కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.రోజూ బార్లీ నీళ్ల‌ను తాగ‌డం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు.