గుడ్ న్యూస్.. వారికి పింఛన్ పెంచిన టీసర్కార్.. ఎంతంటే?

తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఆసరా పింఛన్ పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆసరా పింఛన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఆదుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణను దేశానికి ఆదర్శవంతంగా నిలుపుతున్నారు.

రైతులకు ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా అందిస్తూ రైతుల కళ్లల్లో ఆనందం నింపారు సీఎం కేసీఆర్. అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులను ఆదుకునేందుకు ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా దివ్యాంగులకు నెలనెల రూ. 3016 లు, మిగతా వారికి రూ. 2016లు ఇస్తున్నారు. . కాగా ఇటీవల దివ్యాంగుల పింఛన్ మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు.

వారికి అందిస్తున్న ఆసరా పింఛన్ రూ. 4016 పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన పిఛన్ ను జూలై నెల నుంచే అమల్లోకి రానుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. ఆసరా పింఛన్ పెంపు నిర్ణయంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దివ్యాంగులకు రూ. 4016 పెంచి ఇవ్వడమనేది చరిత్రాత్మక నిర్ణయం అని మంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.