చాణిక్య నీతి ప్రకారం భార్య పొరపాటున ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు…

మన చేతులారా చేసుకునే పనులే కొన్నిసార్లు మననే చిక్కుల్లో పడేస్తాయి, మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తున్న సందర్భాల్లో చాలా ఉంటాయి. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాల గురించి చానిక్యుడు మనకు వివరిం గా చెప్పాడు. చాణిక్యనీతులలో మనం చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అని మనకు వివరంగా తెలియజేశాడు. అలా చాణిక్య నీతి ప్రకారం భార్య ఇంట్లో ఏ విషయాల గురించి ఇతరులతో పంచుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాపపుణ్యాలను బెరిజి వేసుకోవడంలోనే మనిషి సగ జీవితం అయిపోతుంది, కష్టతరమైన పనులను ఇచ్చినప్పుడే పని వాళ్ళ గుణం తెలుస్తుంది, కష్ట సమయాలలో అన్నదమ్ముల బంధువుల మనస్తత్వాలు తెలుస్తాయి, ఆపద సమయాలలో మిత్రుల గురించి, డబ్బులు లేనప్పుడు భార్య గురించి తెలుస్తుంది అనే చాణక్యుడు చెప్తాడు.

ఈ సమయాలలో వారికి పరీక్షాకాలం లాంటిది అలాగే మన చుట్టూ ఉన్న జంతువుల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చాణిక్యుడు చెప్పాడు. అదేమిటి అంటే పని ఎంత చిన్నది అయినా సరే మనసు పెట్టి చేయాలనీ పులి నుంచి నేర్చుకోవచ్చు, అలాగే సమయాన్ని బట్టి మీ శక్తిని అంతా ఉపయోగించి పనిచేయాలి అని ఎలుగుబంటిని చూసి నేర్చుకోవాలి, చూసి చూసి జాగ్రత్తగా పని చేసుకోవాలి ఎవరిని అంత తొందరగా నమ్మవద్దు అని కాకిని చూసి నేర్చుకోవాలి, ఆకలి వేస్తున్న సరే తట్టుకుంటూ నిద్ర పోవాల్సిన సమయంలో యజమానిపై విశ్వాసంతో పని చేయాలని కుక్కను చూసి నేర్చుకోవాలి, ఇలా చానిక్యుడు మనిషి నిరంతర పని పట్ల ఎలా ఉండాలో చెప్పాడు. మన దగ్గర డబ్బు లేకపోతే మనకు మనశ్శాంతి కూడా కరువైనట్టే ఉంటుంది, అందుకే మన పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు, మనల్ని నమ్మించి మన పరిస్థితి తెలుసుకొని మనని ఆటపట్టించేవారు ఉంటారు.

అందుకే పక్క వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చేతులారా చేసుకొనే పనులే మనల్ని ఇతరులు చేతిలో చులకన చేస్తాయి, మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనం నమ్మని వారి దగ్గర ఆ విషయాల గురించి చెప్పకూడదు. మన దగ్గర డబ్బు ఉంటేనే మన చుట్టూ ఉండేవాళ్లు ఆ డబ్బే మాయం అయ్యాక దాంతో పాటే వారు కూడా మాయం అవుతారు. మనల్ని చులకన చేస్తారు అని అనుకునే వారితో మన ఇబ్బందుల గురించి చెప్పకూడదు, ఎడారిలో ఎంత వర్షం పడినా అక్కడ చెట్లు పెరగవు, పూలు పూయవు అందులో మనం వర్షాన్ని నిందించి ప్రయోజనం ఉండదు. అందుకే మనం మన పరిస్థితుల గురించి చెప్పుకుంటూ పోతే అది మనకే ముప్పును తెచ్చిపెడుతుంది, అందుకే ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచి మీ కష్టాలను మీరే భరించడానికి ప్రయత్నం చేయండి, మెరిసేదంతా బంగారం కాదు మనం చూసేవన్నీ నిజాలు కావు, అందుకే మన చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, ఎవరికి మన మీద పెత్తనం చేసే అవకాశం మనమే మన చేతులారా ఇవ్వకూడదు. ఆ అవకాశాన్ని మనల్ని ఇంకా కిందకు లాగేసేందుకు వాడుకోవచ్చు వాళ్ళు.అందుకే మన ఇంట్లోనే ఆర్థికపరమైన ఇబ్బందులని ఇతరులతో పంచుకోకూడదు, మనం ఊరికే చెప్పినా కూడా మనం వారి దగ్గరి నుంచి ఏదో ఆశించి చెబుతున్నామని అనుకుంటారు, ఇక నెమ్మదిగా మనల్ని దూరం పెట్టడానికి చూస్తూ ఉంటారు. అలాగే మన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఇతరులతో పంచుకోకూడదు, అంటే మన గతం తాలూకు చేదు అనుభవాలను మన లోపాలను మనం చేయలేని పనులను, మనకు చేతకాని పనులను ఇతరులతో పంచుకోకూడదు, ఆ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనల్ని వాళ్లు అవమానపరిచే అవకాశం ఉంటుంది.

మన మిత్రులు ఏమైనా తేడా వస్తే శత్రువులు అయిపోతారు, అందుకే కష్టాలను సాధ్యమైనంత వరకు మనలోనే దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక భార్యాభర్తల గొడవల గురించి తొందరపడి ఇతరులకు చెప్పకూడదు, భార్యాభర్తలు అన్నాక చాలా చిన్నచిన్న గొడవలు అవ్వడం సహజం. కుదిరితే మీ సమస్యను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి, అంతే కానీ ఇతరుల దగ్గర ఆ విషయాలను చెప్పి మీ గురించి మీరే చులకన చేసుకోవద్దు.వారు అవకాశం వచ్చినప్పుడు మీ పరిస్థితిని వారికి అనుగుణంగా వాడుకుంటే మీరు ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే వీలైనంత వరకు చిన్న చిన్న విషయాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు. అలాగే మనకు జరిగిన అవమానాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు, అసలు మీకు అవమానం జరగడానికి మీ ప్రమేయం ఉందా లేదా అనే విషయం మీకు మాత్రమే తెలుసు, కానీ మీరు ఇతరులకు చెప్పడం వలన వారి దృష్టిలో మీరు చులకన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ విషయాలు ఇంకొంత మందికి తెలిసే అవకాశం లేకపోలేదు, అందుకే మీరు ఏ విషయం గురించి అయినా చెప్పాలి అనుకుంటే మీకు చాలా నమ్మకస్తులు అయితే మీరు మీ విషయాలను వారితో పంచుకోండి.