చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక ఈ మొక్క గురించి తప్పక తెలుసుకోండి…

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా, అయితే మీరు కచ్చితంగా ఈ మొక్క గురించి తెలుసుకోవాల్సిందే, మరి ఆ మొక్క ఏంటి ఎందుకు దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి, అని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 70 సంవత్సరాల క్రితం గోధుమ విత్తనాల దిగుమతి ద్వారా, భారత దేశంలోకి వయ్యారిభామ అనే మొక్క ప్రవేశించింది. ఇది సుమారుగా రెండు మీటర్ల ఎత్తు పెరిగి, ఆకులు చీరికలతో ఉండి వాటిపై రోమాల లాంటి సన్నని లోపుతో కొన్ని శాఖలుగా విస్తరించి ఉంటుంది.

మొలక ఎత్తిన నాటి నుంచి, నాలుగు నుండి ఆరు వారాల్లోనే పోతదశకు చేరుకొని, పదివేల నుండి 25 వేల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని విత్తనాలు గాలిలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తూ ఉంటాయి. అయితే ఈ వయ్యారిభామ మొక్క అనగానే ఆ అమ్మాయి ఎక్కడ అని తిరిగి చూస్తారు. నిజానికి ఇది ఒక మొక్క పేరు కానీ ఈ వయ్యారి భామను చూస్తే మాత్రం చాలా మంది దూరం జరుగుత రు. ఎందుకంటే ఆ మొక్క కాదు, దాని పేరు వింటేనే రైతుల గుండెల్లో హడలు పుడుతుంది. అసలు ఈ వయ్యారి భామ మొక్క ఏంటి దానివల్ల చాలామంది ఎందుకు భయపడతారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

వయ్యారిభామ మొక్క అనేది ఒక కలుపు మొక్క దీని పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే, ఈ మొక్క తెల్లగా పూలు పోస్తూ ఉంటాయి. చాలామంది పిల్లలు ఆడుకునే సమయంలో వీటిని కోసి ముక్కుకు ముక్కుపుడకలాగా పెట్టుకునేవారు. తడి ఆరే వరకు అది ముక్కుపుడకలాగా అందంగానే కనిపిస్తుంది. మొదటగా కొమ్మలు అన్నీ సన్నగా ఆకులు చామంతి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.