చెట్టు వేరునుంచి స్వచ్ఛమైన జలధార..ఎక్కడి నుంచి, ఎలా వస్తోంది…

అప్పుడెప్పుడో భైరవద్వీపం సినిమా చూసినప్పుడు, అందులో హీరో బాలకృష్ణ ఒక చెట్టు నుండి నీరు పారుతున్న సౌండ్ ను వింటాడు. దీంతో ఆ చెట్టుకొమ్మను నరకడంతో స్వచ్ఛమైన జలం బయటికి ధారగా వస్తుంది.అది చూసి బాలయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెట్టును చూసి అబ్బ ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా, అని అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇలాంటి చెట్లు అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయని, ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఇప్పుడు అలాంటి చెట్టు ఒకటి ఏలూరు, ఏజెన్సీ ప్రాంతంలో కనిపించింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు, పైగా చెట్టుకు సమీపంలోని శివాలయం ఉండడంతో, అదంతా శివయ్య మహిమ అంటూ చెప్పుకుంటున్నారు.

ఇంతకీ ఆ చెట్టు నుండి నీరు ఎలా వస్తుంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ఇటీవల కొన్ని రకాల చెట్లనుంచి నీరు, దిగి రావడం పాలు కారడం కోసం కానీ, అంతకుమించిన విచిత్ర సంఘటన ఏలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అవును ఏలూరు ఏజెన్సీలోని కట్టుకోరు గ్రామంలో ఒక చెట్టు వేరు నుంచి, స్వచ్ఛమైన నీటి ద్వారా పౌరావహిస్తోంది. అది చూసే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎన్నో ఏలుగా చెట్టు వేరు నుంచి నీరు వస్తుందని అదంతా దేవుని మహిమే అని అంటున్నారు స్థానికులు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కటుకూరు అనే గ్రామంలో, ఒక చెట్టు వేరు నుంచి నిరంతరాయంగా నీరు వస్తుంది. స్థానిక మహాశయుడి ఆలయ సమీపంలో, ఈ చెట్టు ఉంది ఏళ్ల క్రితం నుంచి ఈ వృక్షం కింద వేరు నుంచి నీరు ధారగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

కాలంతో పని లేకుండా నిరంతరంగా ఈ చెట్టు వేరు నుంచి నీరు రావడం పరుస్తుంది. స్వచ్ఛమైన ఈ నీరు తాగితే రోగాలు సైతం మాయమవుతాయని, స్థానికులు ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం మొదట్లో ఈ చెట్టు వేరు నుంచి వస్తున్న నీరును చూసి, స్థానికులు కొండ కోనల్లో నుంచి నీరు వస్తుందని భావించారు. అయితే మందు వేసవిలో సైతం నీరు అలాగే రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అది ఇప్పటికీ ఎంత పట్టలేని రహస్యంగా మిగిలిపోయింది. ఇక్కడ సమీపంలో మహా శివుడి ఆలయం ఉండడం పక్కనే చెట్టు వేరు నుంచి నీరు రావడం ఇదంతా, పరమేశ్వరుడి మహి అని భక్తులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా చెట్టు వేరు నుంచి వస్తున్న ఈ నీరు, ఎక్కడికి వచ్చే పర్యాటకులు భక్తుల దాహాన్ని తీరుస్తుంది. చెట్లు ఎత్తైన కొండలు, కోనల నడుమ ప్రకృతి అందాలతో విలసిల్ల ఈ కట్కూరు, ప్రాంతంలో ఈ వింత అందర్నీ కట్టి పడేస్తోంది.