తిరుమల నష్టం గురించి బ్రహ్మం గారు మందే చెప్పారా..

భారతీయులు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాలను ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అని భావిస్తూ ఉంటారు. అయితే మన పూర్వీకులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. వాటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానం తో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘసంస్కర్త. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవించే ముందుగానే ఊహించి చెప్పారు. వాటిలో చాలావరకు నిజం అయ్యాయి.

https://youtu.be/eRgIK4ARXvM

వాటిలో ఒకటి తిరుమల గురించి కూడా ఉంది. తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి అని బ్రహ్మం గారు ముందే చెప్పారు. భారీ వరదకు తిరుమల పరిసరాలు అన్ని రూపురేఖలు మారిపోయాయి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏ దారిలోనూ తిరుమలకు వెళ్లే పరిస్థితి లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వరద ముంచెత్తుతోంది అన్న సంగతి తెలిసిందే. నవంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు తిరుమల వద్ద కురిసిన భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. శేషాచల కొండల వద్ద డ్యాం లో చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వరద కారణంగా తిరుమలలో నాలుగు కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని బ్రహ్మం గారు ముందే చెప్పారు.

అంతే కాదు ఆయన పలు ఇతర విషయాల గురించి కూడా వెల్లడించారు. వెంకటేశ్వర స్వామివారి సంపదను ఆరుగురు దోచుకుంటున్నారని, శ్రీశైలమల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని, కృష్ణానది మధ్యలో బయటపడ్డ బంగారు రథాన్ని చూసిన వాళ్ళు కళ్ళు పోగొట్టుకుంటాడని, మధుర-మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయదుర్గంలో చిలుక వీర ధర్మాలను చెబుతోందని, బనగానపల్లె లో పాత్ర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, శ్రీకాళహస్తి లో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళి పోతాడు అని, కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. ఇప్పటికే ఆయన చెప్పినవి కొన్ని నిజమవడంతో ఆయన కాలజ్ఞానానికిఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.