తెలంగాణ బడ్జెట్ 2023 : సొంత స్థలం ఉందా? రూ.3 లక్షల ఉచిత సాయం.. బడ్జెట్ లో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ బడ్జెట్ 2023 : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. మీకు సొంత స్థలం ఉందా? ఉండటానికి ఇల్లు లేదా? అక్కడ ఇల్లు కడదామంటే డబ్బులు లేవా? మీలాంటి వారి కోసమే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారి కోసం ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దీనికి సంబంధించి ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

సొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇది సామాన్యులు, పేదల కోసం తీసుకొచ్చిన పథకం. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఉచితంగా అందిస్తోంది.

వాటితో పాటు సొంత స్థలం ఉన్నవాళ్లకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది.సొంత జాగా ఉన్నవాళ్లు గ్రామ పంచాయతీ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. వాళ్లు అప్లికేషన్ తీసుకొని పై అధికారులకు పంపిస్తారు. అన్నీ ఓకే అయితే సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీకు సొంత ప్లేస్ ఉంటే వెంటనే ఈ పథకానికి అప్లయి చేసుకొని రూ.3 లక్షల సాయం పొంది సొంతిల్లు నిర్మించుకోండి.