థైరాయిడ్ సమస్య ఇబ్బంది పెడుతోందా? అయితే ఇలా చేయండి..

ఈ మధ్య చాలామందిలో అత్యంత సాధారణంగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దానికి గల కారాణాలు ఏంటి? దీన్ని నయం చేసుకునే విధానాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.. థైరాయిడ్ అనేది మన మెడ భాగంలో ఉండే ఒక గ్రంధి. ఈ గ్రంధి మూడు రకాల థైరాయిడ్ హార్మోన్స్ ను తయారు చేస్తుంది. అవి టీ3, టీ4, టీఎస్ హెచ్. టీ3 అనేది టీ4ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా టీ4 అనేది మనం రోజువారీ తీసుకునే ఆహారం ఏ కణానికి ఎంత వెళ్లాలి ?

ఎంత శక్తి మన శరీరానికి అందాలి? అనే అంశాల్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ టీ4 ఉత్పత్తి తక్కువైపోతే టీ ఎస్ హెచ్ ( థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ) అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. టీ4 అంటే థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ మన శరీరంలో సరిగ్గా తయారయిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే టీ ఎస్ హెచ్ ను రక్త పరీక్ష చేసి కనిపెట్టాలి. టీ ఎస్ హెచ్ ఎక్కువగా ఉంటే థైరాక్సిన్ సరిగా లేదు అని అర్థం. దీని ద్వారా మన శరీరంలో థైరాయిడ్ సమస్య ఉందా లేదా అనేది మనం కనిపెట్టొచ్చు. థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది థైరాటైసిస్. శరీరంలో ఏదైనా మంట వచ్చినప్పుడు లేదా ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లెమ్ వచ్చినపుడు థైరాయిడ్ గ్రంధి కి వాపు వస్తుంది.

ఈ వాపు అనేది థైరాయిడ్ ఉత్పత్తిని ఉన్నట్టుండి పెంచడం గానీ, ఒక్కసారిగా తగ్గించడం గానీ చేస్తుంది. థైరాయిడ్ ఉత్పత్తి పెరిగితే, దాన్ని హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపో థైరాయిడిజం అని అంటారు. కొన్నిసార్లు మన శరీరమే మన శరీరంలోని కణాలను నష్టపరుస్తుంది. దీన్నే హషిమోటోస్ థైరాటైసిస్ అంటారు. అయితే, ఈ సమస్యలకు నేచురోపతి లో చాలా చికిత్సా పద్దతులున్నాయి. అలాగే, ఎన్నో యోగాసనాలు కూడా ఉన్నాయి. ఆహార నియమాలున్నాయి. అదే విధంగా జీవన విధానాలు కూడా ఉన్నాయి. ఈ నాలుగు పద్ధతుల్ని పాటించినపుడు మాత్రమే మనం థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి..