పరగడుపున 1 స్పూన్ గింజలను నమిలి మింగితే జీవితంలో డాక్టర్ అవసరం ఉండదు…ఇది నిజం

ఈ రోజు గుమ్మడి గింజలలో ఉన్న పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. గుమ్మడి గింజలు అనేవి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒకప్పుడు ఇంటిలో గుమ్మడికాయతో కూర చేసుకుంటే దానిలో గుమ్మడి గింజలను తీసి, శుభ్రం చేసి ఎండబెట్టి, పై తొక్క తీసి తినేవారు.కానీ ఇప్పుడు అన్నీ డ్రై ఫ్రూట్ షాప్ లలో,ఆన్లైన్ స్టోర్ లలోనూ, సూపర్ మార్కెట్స్ లో విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గుమ్మడి గింజలను పచ్చిగా తినవచ్చు…లేదంటే వేగించి తినవచ్చు…లేదంటే నానబెట్టి తినవచ్చు.

గుమ్మడి గింజలలో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. గుమ్మడి గింజలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన డయబెటిస్ నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. గుమ్మడి గింజలు, ఆకులు, గుమ్మడి గుజ్జు అన్నీ డయబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి.

ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, విటమిన్ ఈ ఉత్పన్నాలు, కెరోటిన్ సమృద్దిగా ఉండటం వలన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టటానికి సహాయపడుతుంది. ఈ గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది. అలాగే చర్మం ముడతలు లేకుండా యవ్వన్నంగా ఉండేలా చేస్తుంది. ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.