పెరలాసిస్ వస్తుంది అని తెలిపే 9 స్ట్రాంగ్ సంకేతాలు….

పక్షవాతం అనే మొండి జబ్బు అది ఇబ్బంది పెట్టే జబ్బు ఇది కనుక వచ్చింది అంటే మనిషి సహజంగా తన పని తాను చేసుకునే అవకాశాలు మరల పూర్వం వలె సాధారణంగా వృత్తి వ్యాపారలోకి వెళ్లే అవకాశాలు 20 -25 శాతం మందికి వస్తే మూడు వంతులు మందికి పక్షవాతం వచ్చిన తర్వాత ఇక ఇంట్లోనే పరిమితం అవుతారు వేరే వారితో సేవలు చేయించుకునే స్థితికి పరిమితం కావలసి వస్తుంది. అందుకని ఏ జబ్బు వచ్చినా పర్వాలేదు కానీ పక్షవాతం మాత్రం రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి పక్షవాతం అనేది చెప్పి రాదు సడన్గా ఒక అర నిమిషం నిమిషంలోనే చెయ్యి కాలు పడిపోతుంది. ఇక అక్కడి నుండి చూసినట్లయితే మానసిక వేదన అటు పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి, కుటుంబ సభ్యులకి ఇక తప్పదు.

మరి అలాంటి పక్షవాతం రావడానికి ప్రధానంగా మూడు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. మరి ఈ జబ్బు రాకూడదు అంటే ఈ మూడు ముఖ్యమైన కారణాల విషయాలలో శ్రద్ధ పెట్టాలి. ఎందుచేత అంటే ఈ రోజుల్లో పక్షవాతం 15, 20 ఏళ్ల పిల్లలనుండి వస్తుంది. పూర్వ రోజుల్లో చూసినట్లయితే, ఒక 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసినట్లయితే, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పెరాలసిస్ వచ్చేది. కానీ ఈ రోజుల్లో అంత చిన్న వయసులో రావడానికి జీవనశైలిలో వచ్చే ఈ మూడు పెద్ద తప్పులే కారణం. పక్షవాతం రావడానికి మూడు కారణాలు చూస్తే మొట్టమొదటిది సాల్ట్ ఎక్కువ తినడం , ఇది అన్నిటికంటే ప్రమాదం. సాల్ట్ కి రక్తాన్ని చిక్కపరిచే గుణం ఉంటుంది.

రక్తనాళాలను గట్టిపరిచే గుణం ఉంటుంది. రక్తాన్ని గడ్డకట్టేటట్టు చేసే గుణం ఉంటుంది, ఇక బిపి రావడానికి కూడా సాల్ట్ కారణమవుతుంది అందుచేత ఎవరైతే సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారో ఏ దేశస్తులు ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారు ఆ దేశంలో పక్షవాతాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్ గా చూసుకుంటే కూడా ఉప్పు రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది అనడానికి ఉదాహరణకి అమ్మవారి దగ్గర ఎప్పుడైనా కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి మేకలను కోస్తూ ఉంటారు, ఆ మేకల మెడ కోసిన తర్వాత రక్తాన్ని ఒక బేసిన్ లో పడతారు దాన్ని ఒక ప్రసాదంగా పారేయకుండా ఉపయోగించడం కోసం, అలా బేసిన్ పడతారు, ఇలా వచ్చిన రక్తాన్ని గడ్డ కట్టడం కోసం కొద్దిగా ఉప్పు వేస్తారు.

ఆ ఉప్పు వేసేసరికి నిమిషాల్లోనే రక్తమంతా గడ్డకట్టిపోతుంది. అలా అలా రక్తాన్ని గడ్డ కట్టించే శక్తి సాల్ట్ కి ఉంది అందుకని మనందరం టేస్ట్ కోసం సాల్ట్ ని ఏ అనుమానం లేకుండా ఎవరికి ఎంత ఇష్టమో కూరల్లోనూ చట్నీలో ఇవన్నీ కాకుండా బయటకి జామకాయలలో మొక్కజొన్నకంకులలో పుచ్చకాయ ముక్కలలో, అన్నిటిలోనూ కూడా సాల్ట్ పెట్టుకొని తింటూ ఉంటాం. సాల్ట్ వాడకం బాడీకి డాక్టర్లు ఇచ్చిన పుస్తకాలలో ఉన్నట్లు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు తీసుకోవడం మంచిది. కానీ మనం 15 గ్రాముల నుండి 25 గ్రాములు మధ్యలో ఉప్పు ఒక రోజంతా తింటూ ఉంటాం. ఇంకా కొంతమంది 30 గ్రాముల పైనే తింటూ ఉన్నారు. అసలు ఏ జంతువు కూడా సాల్ట్ తినదు అందుకని ఏ జంతువు కూడా పెరాల్సిస్ కాదు కేవలం మనుషులకు మాత్రమే పెరాలసిస్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి.