ప్రభాస్‌కు తీవ్ర అస్వస్థత.. షూటింగ్స్ క్యాన్సిల్.. ఆందోళనలో ఫ్యాన్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి చిత్రంతోనే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ప్రభాస్ నటించే ప్రతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.ప్రస్తుతం  డాల్లింగ్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. గత ఏడాది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కన్నుమూశారు. దాంతో కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. ఈ మద్య షూటింగ్స్ లో మళ్లీ బిజీ అయ్యారు ప్రభాస్. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీ షూటింగ్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ నిమగ్నమయ్యాడు ప్రభాస్. వీటితో పాటు మారుతి మూవీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

ఈ చిత్రాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే. ఇలా వరుస పెట్టి  షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్.. తాజాగా అనారోగ్యానికి గురైనట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల వరుస బిజీ షెడ్యూల్ తో షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ప్రభాస్ పాల్గొంటున్న షూటింగ్స్ కి విరామం ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో మారుతి మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కావాల్సి ఉంది. జ్వరం కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే..

ప్రభాస్ కి అనారోగ్యం అని తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ పూర్తి చేశాడు. పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ఓ మూవీలో నటించబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ ప్రకటించారు. ప్రభాస్ త్వరగా కోలుకొని ఆరోగ్యంతో రావాలని ఫ్యాన్స్ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.