ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సీరీస్ లో రాజీ క్యారెక్టర్ బోల్డ్ గా నటించింది. ఎల్ టీటీఈ మిలిటెంట్ పాత్ర!

సమంతా, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బాయ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి నాగచైతన్య సోషల్ మీడియాలో వెల్లడించగా, సమంత కూడా అదే ప్రకటనను పోస్టు చేశారు. చైతూ -సామ్‌ జంట విడిపోతుందని ఎప్పటినుంచో సంకేతాలు కొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.. ఈ రోజుతో దీనికి పులిస్టాప్ పడింది.అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారన్న విషయంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.

The Family Man 2' controversy: Amazon Prime Video issues gag order for  Samantha Akkineni

అయితే ఫిలిమ్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. సమంత నటించిన ఫ్యామిలీమెన్‌ వెబ్‌సిరీస్‌ చాలా హాట్‌ టాపిక్‌ మారింది. ఈ వెబ్ సీరీస్ సమంత-నాగ చైతన్య పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మేన్ వెబ్ సీరీస్ లో సమంత శ్రీలంక ఎల్ టీటీఈ మిలిటెంట్ రాజీ పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమె కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది.అప్పట్లోనే ఈ విషయంలో పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని అభినులు సైతం బాహాటంగానే విమర్శించారు.

Ban The Family Man season 2': Rajya Sabha MP Vaiko writes to Prakash  Javadekar, says Amazon Prime show depicts Tamilians in negative light |  Entertainment News,The Indian Express

అక్కినేని కుటుంబంలో కూడా ఈ రాజీ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అక్కినేని కుటుంబ సభ్యులకు – సమంతాకు మద్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో చైతూ కూడా కుటుంబ సభ్యుల వైపు నిలిచినట్లు సమాచారం. ఇంత జరిగినా సినిమా విషయంలో సమంత తన కమిట్ మెంట్ మార్చుకోకపోవడంతో చివరికి విడాకుల తప్పలేదని తెలుస్తుంది. మరి సమంత నటించిన ఫ్యామిలీ మేన్ వెబ్ సీరీస్ లోని రాజీ పాత్ర వీరి విడాకులకు కారణం అని మీరు భావిస్తున్నా.. మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.