బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం..ఆయన కుమార్తె ఆత్మ హత్య ..!!

ప్రముఖ సంగీత దర్శకుడు, బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోని కుమార్త్ ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విజయ్ ఆంటోని తన కుటుంబంతో కలిసి చెన్నైలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ ఆంటోనికి ఇద్దరు కూతురులు ఉన్నారు. మీరా, లారా. పెద్దు కూతురు మీరా ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది.

ఒత్తిడికి లోనై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా బిచ్చగాడు మూవీతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకన్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఆయన కుమార్తె సూసైడ్ చేసుకోవడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.