బ్రేకింగ్: కొకాపేటలో రూ.100 కోట్లు దాటిన ఎకరం ధర!

ఈ కాలంలో సొంత భూమి ఉన్నవాడు మహారాజు అంటారు. ఇక హైదరాబాద్ లో భూమి ఉన్నవాళ్లు అయితే కోటీశ్వరులు అన్నా అశ్చర్యపోనక్కరలేదు. ముఖ్యంగా కోకాపేట ప్రాంతంలో భూమి అంటే కోట్ల మాట అన్నట్టే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ భూములకు మంచి ధరలు పలకడం చూస్తూనే ఉన్నాం. గతంలో అంతంత మాత్రమే ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల బాగా పుంజుకుంది. హైదరాబాద్ లో భూముల రేట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక కోకాపేటలో భూమి కొనడం అంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఇక్కడ భూములు రేట్లు ఎకరం కోట్లలో ఉంటుందని అందరికీ తెలిసిందే. తాజాగా కోకాపేటలో నియోపోలీస్ భూములు వేలంలో ఎవరూ ఊహించనంత ధర పలికింది.

ఎకరం భూమి ధర ఏకంగా 100 కోట్లు పలికింది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధిక భూమి ధర అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోకాపేట భూముల వేలంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.. ఏకంగా ఎకరా వందకోట్లు దాటింది. ఉదయం నుంచి కొనసాగుతున్న వేలంలో భూముల కోసం రియల్ ఎస్టేట్ కంపెనీవాళ్లు గట్టిగానే పోటీ పడుతున్నారు. తాజాగా కోపాపేటలోని నియోపోలీస్ భూములు వేలం వేయడంతో ఏకరం భూమి ఏకంగా వంద కోట్ల రూపాయలు పలికింది. ఫ్లాట్ నెం.10 కోసం బిడ్డింగ్ రూ. 100 కోట్లు దాటింది. ఏపీఆర్, రాజ్ పుష్ప కంపెనీ అధినేతలు ఈ బిడ్డింగ్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫ్లాట్ నెం. 9లో ఎకరం భూమి ధర రూ.76.5 కోట్ల వరకు పలికింది.

మొత్తంగా రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఫ్లాట్ నెం. 10 లో 3.60 ఎకరాల భూమి, ఫ్లాట్ నెం.11లో 7.53 ఎకరాల భూమి, ఫ్లాట్ నెం.14లో 7.34 ఎకరాలు ఉంది. కాగా, ఈ మూడింటికి వేలం కొనసాగింది. ఈసారి  వేలంలో బడా రియల్ ఎస్టేట్  కంపెనీలు పోటీపడ్డాయి. ఇక్కడ ఎకరం భూమి కనీస ధర రూ.35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇప్పటి వరకు నియోస్ పోలీస్ లో 26.86 ఎకరాల మేరకు వేలం పూర్తయ్యింది. గురువారం మధ్యహ్నాం 3.00 గంటల వరకు 18.47 ఎరాల మేర వేలం కొనసాగింది. కాగా, నియో‌పోలిస్ ఫేజ్-2లోని 6 నుంచి 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల వరకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరినట్లు సమాచారం.