బ్రేకింగ్ న్యూస్ ! మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

తెలుగు రాజకీయాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రోశయ్య చాలా రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకి ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ అయ్యింది. దీంతో.. కుటుంబ సభ్యులు రోశయ్యని బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.., ఈ లోపే మార్గం మధ్యలో రోశయ్య కన్నుమూసినట్టు డాక్టర్స్ నిర్ధారించారు.

https://youtu.be/1cTduzfyGe4

తెలుగు రాజకీయాలకి దూరంగా ఉంటున్న రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. ఇక సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. చిన్ననాటి నుండి రాజకీయాల పట్ల ఆకర్షితులు అయిన రోశయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రోశయ్య తొలిసారిగా మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు, రహదారుల శాఖ, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో రోశయ్య ఆర్ధిక మంత్రిగా అద్భుతంగా తన బాధ్యతలు నిర్వర్తించారు. రాజశేఖర్ రెడ్డి పై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, వాటిని సభలో మొండిగా, తెలివిగా తిప్పి కొట్టిన ఘనత రోశయ్యదే. ఇక వై. ఎస్. పథకాలు అమలు కావడంలో కూడా రోశయ్య ది కీలక పాత్ర. మరి.. రోశయ్య ఆత్మకి శాంతి చేకూరాలని కామెంట్స్ రూపంలో కోరుకుందాం.