మా పొట్ట కొడుతున్నారు కదా.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆందోళనలో ఆటో డ్రైవర్ల ..

Auto Drivers :  తెలంగాణకు చెందిన మహిళలు, ఆడపిల్లలకు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ స్కీమ్ చాలా మంచిది అని.. మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అసలు ఇలా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చేకంటే కూడా టికెట్ల ధరలు తగ్గించవచ్చు కదా అంటున్నారు. అయిత.. ఇలా బస్సుల్లో ఉచిత ప్రయాణాలు పెడితే అది ఆటోలకు, క్యాబ్ లకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని మరికొందరి వాదన.

ముఖ్యంగా అప్పు తెచ్చి మరీ ఆటో కొని నడిపే ఆటో డ్రైవర్ మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంది. అసలు మేము ఎలా బతకాలి.. అంటూ కొందరు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను గత 5 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నా. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడంతో మాకు చాలా తక్కువ మహిళ ప్రయాణికులు వస్తారు. దాని వల్ల మాకు నష్టం కలుగుతుంది. అప్పులు చేసి ఆటోలు కొన్నాం. రోజుకు 400 కిరాయి ఇవ్వాలి. 5 లక్షలు పెట్టి ఆటో కొన్నాం. ఫైనాన్స్ కట్టాలి. దీనిపై భవిష్యత్తులో మేము ధర్నా కూడా చేస్తాం. మాకు యూనియన్ ఉంది. మాకు కూడా ఏదైనా సాయం చేయాలి అని ఓ ఆటో డ్రైవర్ అన్నారు. సీఎం సార్ ఈ విషయంలో మమ్మల్ని కూడా చూడాలి. ఆటోకు లాస్ అవుతుంది. ఫైనాన్స్ కట్టే డబ్బులు కూడా రావు. ఏం చేయాలి అంటూ ఆటో డ్రైవర్లు అంటున్నారు.

 మహిళలకే కాదు.. ఆటో వాళ్లను కూడా చూసుకోవాలి

మీరు ఏదైనా చేయాలని అనుకుంటే బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్లకు కూడా ఏదైనా చేయాలి కదా. ఆటోమెటిక్ గా ఆటోకు నష్టం రాకుండా ఆటో డ్రైవర్ల కోసం ఏదైనా స్కీమ్ తీసుకురావాలి. వాళ్లకు ఆర్థిక సాయం చేయాలి. రోజుకు 1000 వస్తే కూడా మాకు గిట్టుబాటు కాదు. పెట్రోల్ ఖర్చులు, గ్యాస్ ఖర్చులు, ఫైనాన్స్ అన్నీ చూస్తే మాకు మిగిలేది ఏం ఉండదు. మాకు కూడా ఏదైనా చేస్తే అప్పుడు మేము నష్టపోకుండా ఉంటాం. మహిళలకు ఏదైనా బెనిఫిట్ జరుగుతున్నప్పుడు అలాగే ఆటో వాళ్లకు కూడా అంతో ఇంతో ఉపయోగం ఉండేలా చేయాలని మరికొందరు ఆటో డ్రైవర్లు చెప్పుకొచ్చారు.