లక్షల కోట్ల ఆదానీ సంపద ఆవిరి.. అయినా లోన్ ఇస్తామంటున్న ప్రభుత్వ బ్యాంక్!

హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే అదానీ సంపద దాదాపు సగం ఆవిరయ్యింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటా అన్ని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు బ్యాంకులకు కూడా ఇదే తీరు.. ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంక్ అందుకు విభిన్నంగా స్పందిచింది. అదానీ సామ్రాజ్యం కుప్పకూలుతున్నా.. లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటి..? ఈ ప్రకటన ఎందుకు చేసిందన్నది ఇప్పుడు చూద్దాం..

పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ అదానీ వ్యవహారంపై వాడీ.. వేడీ చర్చ జరుగుతోంది. అదానీ సంస్థల అవినీతి, అక్రమాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ నష్టపోయాయని, అందుకు నిరసనగా కాంగ్రెస్‌ కార్యాలయాల ఎదుట బైటాయిస్తోంది. ఇలా ప్రతిపక్షాలు, కాంగ్రెస్ గౌతం అదానీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తుంటే ప్రభుత్వ రంగ బ్యాంకు MD మరియు CEO సంజీవ్ చద్దా.. ఆదానీకి బాసటగా నిలిచే ప్రకటన చేశారు. అదానీ గ్రూప్ కంపెనీలకు లక్షల కోట్లు రుణాలు ఉచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

బ్యాంకు నిబంధనలకు లోబడి రుణదాత యొక్క పూచీకత్తు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, అదానీ గ్రూప్‌కు తమ బ్యాంక్ రుణాలు ఇవ్వడం కొనసాగిస్తుందని చద్దా పేర్కొన్నారు. ఆర్‌బీ‌ఐ నిభంధనలకు లోబడి బ్యాంకులు లోన్లు ఇష్యూ చేస్తున్నాయి. క్రెడిట్ రిస్క్, ఎక్సపోజర్ కు లోబడే చద్దా ఈ ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా, నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు క్రేజీబీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీ‌ఐ) పెనాల్టీ విధించింది. బరోడాపై రూ. 30 లక్షలు, క్రేజీబీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 42.48 లక్షలు, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై రూ. 39.50 లక్షలు పెనాల్టీ విధించింది.