2023 ఉగాది పంచాంగం .. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఆనందంగా జరపుకుంటున్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించి.. పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పంచాంగం ప్రకారం ఈ 5 రాశుల వారికి మాత్రం బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. మరి.. ఆ రాశుల వాళ్లు ఎవరు? వారికి కలిసొచ్చే అంశాలు ఏంటో చూద్దాం.రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. తెలుగు ప్రజలు అంతా ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటున్నారు.

ఉగాది అనగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిని కచ్చితంగా స్వీకరించాలి అని చెబుతారు. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అనేది తెలుగువాళ్ల కొత్త సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషీ చెప్పిన రాశిఫలాల ఆధారంగా ఈ 5 రాశుల వారికి ఈ ఏడాది చాలా బాగుంటుంది. ఆ 5 రాశులు ఏంటి? వారికి కలిసొచ్చే అంశాలు ఏంటో చూద్దాం.

మేష రాశి:

మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో గురువు ఉంటాడు. గురు గ్రహం బలం బాగా ఉంటే జీవితం బాగుపడుతుంది. ఈ సంవత్సరంలో పెళ్లి కాని వాళ్లు పెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు. శుభకార్యం కోసం ఖర్చులు చేస్తుంటారు. ఖర్చుల గురించి జాగ్రత్త పడంటి. భూమి, బంగారంలాంటి భవిష్యత్ అవసరాల కోసం ఖర్చులు చేస్తే మంచిది. ఈ ఏడాది ఇల్లు కట్టుకోవడానికి మేషరాశి వాళ్లు ప్రయత్నించాలి. లేదంటే నాలుగేళ్లు ఆగాల్సి ఉంటుంది. తాహతకు మించి అప్పుడు చేయకండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గండాలు ఎక్కువగా ఉంటాయి. గురు గ్రహానికి పూజ, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశి:

శని, గురు గ్రహం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ ఏడాది నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. మీకు ఈ ఏడాది కలిసొస్తుంది. కార్యోముఖులు అయితే వృషభ రాశి వారికి ఫలితం ఉంటుంది. సాధారణంగా వృషభరాశి వారు ఎంత కష్టం పడినా కలిసిరాదు. కానీ, వృషభ రాశి వారికి ఈ ఏడాది కలిసొస్తుంది. శక్తిని సంగ్రహించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. చాలీ చాలని జీతం కోసం పనిచేస్తున్న ఉద్యోగాన్ని మానేయండి. వ్యవసాయం చేయండి, కూరగాయలు పండించండి, బిజినెస్ చేసుకోవండి. ఏదీ లేకపోతే ఇడ్లీ బండి పెట్టుకోండి. మీకు ఈ ఏడాది బాగా కలిసొస్తుంది.

మిథున రాశి:

అన్ని రాశుల్లో మిథున రాశిలో చాలా మంచి వాళ్లు ఉంటారు. ఈ ఏడాది 9వ స్థానంలో శని, పదో స్థానంలో గురు గ్రహం ఉంది. సూర్యుడు ఎప్పుడు అయితే అనుకూలంగా వస్తాడో ఆ సమయంలో మీరు మీ లక్ ని పరిశీలించుకోవాలి. విడి సమయంలో ఖాళీగా ఉండాలి. చిట్టీ, డైలీ మనీ లెండింగ్ వ్యాపారం చేసే వాళ్లు మానేయండి. శుక్ర, రవి గ్రహం బాగున్న సమయంలో వ్యాపారం స్టార్ట్ చేయండి కొనసాగుతుంది. విద్యార్థులకు విదేశీ యోగం ఉంటుంది. ఈ ఏడాది మిథున రాశి వారు నమ్మక ద్రోహానికి గురవుతారు. రైతులకు బాగా కలిసొస్తుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వాళ్లు అమాయకులు.. చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు. పుష్యమీ నక్షత్రం వాళ్లు ఈ ఏడాది చెప్పుడు మాటలు వినకండి. వీళ్లు ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది మీరు అదృష్టాన్ని మిస్ చేసుకుంటే మళ్లీ 12 ఏళ్లు వెయిట్ చేయాలి. విదేశాలు వెళ్లాలి అనుకుంటే వెళ్లిపోండి. వ్యాపారం ప్రారంభించాలి అంటే ప్రారంభించేయండి. ప్రతిరోజు తెల్లవారు జామున ధ్యానం చేయండి. అమ్మవారు మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడుతుంది. చాలీ చాలని ఉద్యోగాల్లో ఉంటే మానేయండి. కొత్త వ్యాపారం ప్రారంభించండి. భూ, వస్త్ర వ్యాపారాలు కలిసొస్తాయి. లీగల్ సమస్యల జోలికి వెళ్లకండి.

తులా రాశి:

తులారాశి వారి జీవితం ఎప్పుడూ బ్యాలెన్స్ గా ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెడితే అంత సంపాదించేస్తారు. ఈ ఏడాది బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎంత ఖర్చు పెడితే అంత సంపాదిస్తారు.. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతారు. ఐదో ఇంట్లో శని ఉన్నాడు. 55 ఏళ్లపైన ఉన్నవాళ్లు పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే ఈ ఏడాది విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అత్తా కోడళ్లు కూడా గొడవలు పడే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్లు వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఫుడ్, ల్యాండ్ బిజినెస్ చేసేందుకు ప్రయత్నించండి. వస్త్ర వ్యాపారం కలిసొస్తుంది. మిగిలిన రాశుల వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న వీడియో చూడండి.