4 వస్తువులు వంటిట్లో ఉంటే… ఇలా అస్సలు పెట్టొద్దు పెడితే బ్దెవుడు కూడా కాపాడలేరు….

మన పెద్దలు చెప్తున్న సామెత ప్రకారం ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి. అంటే ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఇల్లాలు అంత చక్కగా ఉంటుందని అర్థం. అలాగే ఇంకొక సామెత కూడా ఉంది వంటిల్లును చూసి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం గురించి చెప్పవచ్చు అని అంటారు. అయితే మనం కిచెన్ లో వంట చేస్తూ ఉంటాం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకనే వాస్తు శాస్త్రంలో అగ్నిదేవుడికి కిచెన్ని మనం పెట్టడం జరుగుతుంది. అయితే చాలామంది కిచెన్ లో కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటారు. కొన్ని వస్తువులను కొన్ని తప్పుడు ప్రదేశంలో పెట్టడం వల్ల దాని నుండి వచ్చే ప్రతికూలమైన పరిస్థితులు ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మన ఆరోగ్యం పాడైన తర్వాత మన మనసుని మనశ్శాంతిని తీసివేయడం.

కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం తద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెడితే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఏ వస్తువు ఎక్కడ ఉండకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చీపురుని ఎప్పుడు కూడా తలుపు వెనకలో పెట్టాలి లేదంటే తీసుకునే ఆహార పదార్థాలకి లేదా వండుకునే ఆహార పదార్థాలకి కనిపించేటట్లుగా చీపురుని పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో తిండి ఊడ్చుకుపోతుంది అంటారు. అందుకనే వీటిని గుర్తుపెట్టుకుని చీపురిని తలుపు చాటున ఊడ్చేకొనలు నేలకు ఆనించినట్లు పెట్టాలి. ఇలా పెడితేనే చాలా మంచిది ముఖ్యంగా ఈ చీపురుని పెట్టే చోట ఈశాన్యం మూల లేకుండా ఉండేటట్లు చూసుకోండి. ఈశాన్యం మూల నీరు తప్ప ఏమీ ఉండకూడదు లేదంటే ఖాళీగా వదిలేసినా కూడా మంచిదే.

ఆ తర్వాత చపాతీల కర్ర చపాతీల పీట, చాలామంది ఇళ్లల్లో ఈ చపాతీల కర్ర ఉంటుంది. దీన్ని మనం సాధారణంగా సింకు పక్కన పెట్టాలి, అంటే చెక్క ఐటమ్స్ ఏదైనా సరే ఇలా సింకు పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం మామూలుగా స్టవ్ వాడుతూ ఉంటాం కదా, పొయ్యికి సింక్ కి మధ్య ఈ చపాతీ పీట కర్ర కనుక పెట్టినట్లయితే చాలా మంచిది ఐశ్వర్యం సిద్ధిస్తుందని మన నమ్మకం. ఇక అలాగే చాలామంది సిలిండర్ పెట్టే విషయంలో కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సిలిండర్ అనేది చాలా బరువుతో కూడుకున్నది అందుకని దాన్ని ఎప్పుడూ కూడా సౌత్ ఈస్ట్ వైపు పెట్టాలి, అంటే ఆగ్నేయ దిశలో పెట్టాలి. మీ కిచెన్ లో నించుంటే కిచెన్ లో మనం చూసినట్లయితే దక్షిణ తూర్పు ముఖాలు అంటే మూల అంటారు కదా సౌత్ ఈస్ట్ కార్నర్ అంటారు కదా దక్షిణం తూర్పు మచ్చలు ఒక మూల ఉంటుంది అక్కడ సిలిండర్ ని పెట్టాలి ఆ మూల చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా కూడా పర్వాలేదు.

అంతేకాకుండా స్టవ్ కి ఎప్పుడూ కూడా ఎడమవైపు సిలిండర్ అనేది పెట్టడం చాలా తప్పు ఎప్పుడూ కూడా సిలిండర్ అనేది కుడివైపు ఉండాలి. కాకపోతే ఈ మధ్యకాలంలో స్టవ్వును బట్టి వారు ఇచ్చే ఆప్షన్ను బట్టి సిలిండర్ ను పెట్టే విధానాలు మారుతూ ఉంటాయి కానీ, సిలిండర్ ని వీలున్నంతవరకు వంటింటికి బయట పెట్టడానికి ప్రయత్నించండి, బయట పెడితే వాస్తు అనేది పరిగణలోకి రాదు అందుకని మీరు దానిని గుర్తుంచుకొని పెట్టండి. అంతేకాకుండా వంటింటి విషయంలో కనుక చూసినట్లయితే వంటిల్లు ఎప్పుడు కూడా చక్కగా శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా వంట చేసుకుని స్టవ్ చుట్టూ శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా వంటింట్లో వాడుకునే మసిగుడ్డ ఉంటుంది కదా అంటే స్టవ్ లాంటివి తుడుచుకుంటూ ఉంటారు, చేతులు తుడుచుకునే క్లాతులు అలాంటివి ఉంటాయి కదా దాన్ని లక్ష్మీదేవితో భావించి దాన్ని కాలితో తొక్కడం, విసరడం, కింద పడేయడం, ఇలాంటివి చేయకూడదు.