స్టార్ హీరోయిన్ భానుప్రియకు ఆ జబ్బు.. భర్త చనిపోయిన తర్వాత!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కు కొదవలేదు. ఇప్పుడంటే చాలామంది గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు గానీ 80,90ల్లో మాత్రం చాలామంది బ్యూటీస్.. తమ కళ్లతో హవభావాలు పలికిస్తూ, యాక్టింగ్ తో విజిల్స్ వేయించేవాళ్లు. మరికొందరైతే డ్యాన్స్ లోనూ అద్భుతమైన ప్రతిభ చూపి ఆకట్టుకునేవాళ్లు. ఇక ఆర్ట్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ లోనూ హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో హీరోయిన్ భానుప్రియ కచ్చితంగా ఉంటుంది. తన కళ్లతో బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే ఈమె..

కెరీర్ లో ఎక్కువ హిట్స్ కొట్టింది. ఇక హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ రోల్స్ చేసింది. ఇప్పటికీ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భానుప్రియ పేరు చెబితే ఒకప్పటి సినీ ప్రేక్షకులు పులకరించిపోయేవారు. ఆమెని తలుచుకోగానే ఆమె కళ్లు గుర్తొస్తాయి. నెమలిలా డ్యాన్స్ చేసే భానుప్రియకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన ఈమె.. ఆ తర్వాత మెల్లగా కనుమరుగైపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చి చకచకా సినిమాలు చేసింది.

గత కొన్నాళ్ల నుంచి మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వస్తుంది. ఆమె గురించి ఎలాంటి అప్డేట్ కూడా పెద్దగా లేదు. అలాంటి భానుప్రియ తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొని షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తను ఓ జబ్బుతో బాధపడుతున్నానని చెప్పడంతో.. ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారూ పడిపోయారు. ‘మా వారు చనిపోయిన తర్వాత నుంచి నేను ఇబ్బందుల్లో పడ్డాను. ముఖ్యంగా నా ఆరోగ్యం పాడైంది. మెమొరీ లాస్ అయ్యాను. డ్యాన్స్ కు సంబంధించిన హస్తముద్రలు మర్చిపోయాను. మొన్నీ మధ్య తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే డైలాగ్స్ పూర్తిగా మార్చిపోయాను.

మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకున్నాను. ప్రస్తుతం మందులు తీసుకుంటున్నాను’ అని భానుప్రియ చెప్పుకొచ్చింది. 1998లో భానుప్రియ.. ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకుంది. ఆయన 2018లో చనిపోయారు. ఇక భానుప్రియకు ఓ కూతురుంది. ఆమె ప్రస్తుతం లండన్ లో చదువుకుంటోంది. అయితే ఆమెకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని భానుప్రియ చెప్పుకొచ్చారు. మరి మతిమరుపు సమస్యతో బాధపడుతున్నానని భానుప్రియ చెప్పడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.