కరివేపాకు, మునగాకు లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

మునగాకు ,కరివేపాకు ఈ రెండిటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి .అవి ఇప్పుడు తెలుసుకుందాం. వెనకటి రోజుల్లో ప్రతి ఇంట్లో మునగ చెట్టు, కరివేపాకు చెట్టు కచ్చితంగా ఉండేది. వీటి విలువ తెలుసు కాబట్టే పెద్దవారు ప్రతి ఇంట్లో కరివేపాకు ,మునగ చెట్టు పెంచమని చెప్పారు. కరివేపాకులో ఎక్కువగా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది .

ఇది ఇది మనం తిన్నప్పుడు శరీరంలోకి వెళ్లి న తర్వాత కెరోటిన్ అనే పదార్థాన్ని మన లీవర్ విటమిన్ ఎ గా మారుస్తుంది. విటమిన్ ఏ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. కంటిచూపు మెరుగు పడుతుంది .రోగ నిరోధక శక్తిని పెంచి కణాలనిఎక్కువగా తయారు చేస్తుంది . జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కరివేపాకులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

కరివేపాకుని రోజు వండుకునే కూరలలో తీసుకోండి. లేదా కరివేపాకు పొడిచేసి వాడుకోండి. కరివేపాకు కారం కూడా తయారు చేసుకుని తినవచ్చు. అలాగే మునగాకు లో కూడా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఈ మునగాకును కూరలలో వాడుకోవచ్చు లేదా పుల్కాలు చేసే పిండిలో ఆకులను కలిపి పుల్కాలు చేసుకోవచ్చు.