2023 లో రెండు శ్రావణ మాసాలు…

ఈ సంవత్సరం మనకి రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. ఈ రెండు శ్రావణ మాసాలలో మనం ఏ శ్రావణమాసం అనేది జరుపుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం లో వచ్చాయి, అనే విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం. మనకు ఏ మాసమైనా సరే 30 లేదా 31 రోజులైతే ఉంటాయి. 31 రోజుల తర్వాత మనకి మాసం అంటే నెల అయితే మారుతూ ఉంటుంది. అయితే మనకి ఆషాడమాసం తర్వాత రెండు శ్రావణమాసాలు అయితే రాబోతున్నాయి,

అవి ఏంటంటే అధిక శ్రావణమాసం ఒకటి, నిజ శ్రావణమాసం ఒకటి, రెండు శ్రావణమాసాలు అయితే వస్తున్నాయి, అయితే దీనిలో ఏ శ్రావణమాసం జరుపుకోవాలి అని అడుగుతున్నారు. అందుకని అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ముందుగా అధిక మాసం అంటే ఏమిటి, ఇది ఎప్పుడు వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుందా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం.ఈ అధికమాసం అనేది ప్రతి సంవత్సరం వస్తుందా అంటే, ప్రతి సంవత్సరం రాదు రెండున్నర సంవత్సరాలకి ఒకసారి వస్తుంది, అయితే ఏ శ్రావణ మాసంలోనే ప్రతిసారి వస్తుందా అని మీకు సందేహమైతే రావచ్చు.

శ్రావణమాసంలోనే రాదు చైత్రమాసం నుండి ఆశ్రయిజ మాసం మధ్యలో ఎప్పుడైనా సరే ఈ అధికమాసం రావచ్చు. అయితే మనకి ఈసారి ఈ 2023వ సంవత్సరంలో శ్రావణమాసానికి ముందు వచ్చింది కాబట్టి, దీనిని అధిక శ్రావణమాసం అని అంటారు. అయితే ప్రతి మాసంలో సూర్యుడు సంక్రమణం జరుగుతుంది అయితే ఇలాంటి అధికమాసంలో మాత్రం సూర్యుడు సంక్రమణం అనేది జరగదు. అంటే ఒక్కో రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు, రెండు నెలల పాటు ఒక రాశిలోనే ఉంటాడు.

ఏ మాసంలో అయితే సూర్యుడు సంక్రమణం జరగదు, దాన్ని అధికమాసమని అంటారు. అయితే వీటిని సిద్ధాంతాలు ఎలా లెక్కిస్తారు అంటే, మనం తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తాము, ఇంకా తమిళ్లో శౌరమానాన్ని అనుసరిస్తారు, ఈ రెండింటికి ఉన్న తేడాని సరి చేసేందుకే మన సిద్ధాంతాలు ఈ అధిక శ్రావణ మాసాన్ని జోడించి రెండింటిని కూడా సమానం చేస్తారు. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనకి ఈ మధ్యకాలంలో అన్ని పండగలు కూడా ముందే వచ్చేస్తున్నాయి కదా, ఫిబ్రవరిలో రావలసిన రథసప్తమి జనవరిలోనే వచ్చింది.

ఇంకా ఉగాది పండుగ శ్రీరామనవమి ఎప్పుడు కూడా మనకు ఏప్రిల్ లో వస్తాయి కానీ, ఈ సంవత్సరం ఈ 2023వ సంవత్సరంలో మార్చి నెలలోనే వచ్చాయి. మేలో రావాల్సిన అక్షయ తృతీయ ఏప్రిల్ లోనే వచ్చింది, ఇంకా జూలై నెలలో రా వలసిన ఆషాడ మాసం జూన్ నెలలోనే వచ్చింది, ఒక్కో నెలలో ఒక్కో పండగ వస్తుంది అనే ఐడియా అయితే మనకు ఉంటుంది. కానీ ఏ పండగ అయినా సరే మనకు అన్నీ కూడా ముందే వచ్చేస్తున్నాయి, వాటన్నింటినీ కూడా సవరించేందుకే ఇలాంటి అధిక మాసాలు అనేవి వస్తూ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.