అనేక జుట్టు సమస్యలకు ఉల్లిపాయ నూనెతో చెక్ పెట్టండి…!

ఈరోజు ఒక ఆయిల్ తయారు చేసుకుందామం.. చాలా అద్భుతమైన ఆయిల్ సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఈ ఆయిల్ మీకు వస్తుంది. ఒకసారి కనక మీరు ఈ ఆయిల్ తయారు చేసుకుని మీరు వాడు చూస్తే ఎంటైర్ మీ ఫ్యామిలీ మొత్తం సేఫ్ జోన్ లో ఉన్నట్టే.. కాబట్టి ఇంతకీ ఎందుకు ఈ ఆయిల్ దేనికి తయారు చేసుకోవాలి. అనే విషయాలు తెలుసుకుందాం. ఒంట్లో ఏమైనా నలతగా ఉంటే మనందరికీ తెలిసిందే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ఇలా మన జీవితంలో ఆయిల్ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ ఆయిల్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిన గాని మనకు ఎక్కువ ప్రభావాన్ని చూపించేది మాత్రం హెయిర్ ఆయిల్. ఇటువంటి ఒక హెయిర్ ఆయిల్ ని మనం తయారు చేసుకోబోతున్నాం..

మనం తయారు చేసేది నేచురల్ ఇంగ్రిడియంట్స్ తో హోమ్ రెమెడీ కాబట్టి నిజంగా అన్ని హోమ్ రెమెడీస్ చాలా మందికి ఉపయోగం గానే ఉంటాయి. జాగ్రత్తగా తయారు చేసుకుని చెప్పిన విధంగా అప్లై చేస్తూ రెగ్యులర్గా వాడితే 100% రిజల్ట్ మీరే చూస్తారు. ఇన్ని విధాలుగా ఉపయోగపడే అద్భుతమైన హెయిర్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఉల్లిపాయ రసంతో మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఇది తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ… ఈ ఉల్లిపాయ నూనెని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కాస్త ఘాటుగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ ఉల్లిపాయ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన ఉంచండి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 200 గ్రాముల ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని ఈ ఆయిల్ లో వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. అంటే ఉల్లిపాయలు ఉండే రసం అంత ఆయిల్ లోకి వచ్చిన తర్వాత ఇలా ఉల్లిపాయ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఒక బౌల్లో క్లాత్ వేసి ఉల్లిపాయ ఆయిల్ అంతా కూడా అందులో వేసేసి జాగ్రత్తగా చేత్తో పిండండి. ఇప్పుడు ఈ ఆయిల్ లో విటమిన్ ఈ క్యాప్సిలిస్ ఆయిల్ లో కలిపేయండి. విటమిన్ ఈ ఆయిల్స్ మన స్కిన్ కి గాని చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆయిల్ని ఒకటి గాజు సీసాలో స్టోర్ చేసుకొని నిత్యం అప్లై చేసుకోవడం వలన ఎన్నో జుట్టు సమస్యలు దూరం అవుతాయి.