ఒక్కసారి దీన్ని వాడి చూడండి.

పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కాలి ప్రదేశంలో చెట్ల దగ్గర నల్లేరు మొక్క పెరుగుతుంది. ఈ నల్లేరు మొక్కను మనం చూసి ఉంటాం .కానీ దీని ఉపయోగాలు ఎవరికి తెలియదు. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విరిగిన ఎముకలు అతకడానికి ,ఎముకల పుష్టికి, ఎముకలలోకిక్యాల్షియం బాగా అందడానికి, స్త్రీలకి మెనోపాజ్ సమయంలో ఎముకలు బలంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగినప్పుడు,

ఫ్యాక్చర్ అయినప్పుడు తొందరగా ఆతకడానికి ఈ నల్లేరు బాగా ఉపయోగపడుతుంది. స్త్రీ లలో మెనోపాజ్ సమయంలో ఎముకలు గుల్లబరకుండ, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఎముకలు గుళ్ళబారకుండ, ఈ నల్లేరు పొడి బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు వాడటం వల్ల ఎముకలలోకి క్యాల్షియం బాగా వెళ్తుంది. అలాగే ఎముకలలో కొత్త సెల్స్ ని ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

అందువల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే ఆర్థరైటిస్ వచ్చినవారికి నల్లేరు పొడి బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు మొక్కను దొరికినప్పుడు తీసుకొని ఎండబెట్టి పొడిచేసి ఉదయం,సాయంత్రము,3 గ్రాములు నీళ్లలో కలిపి తాగడం మంచిది.. ఇది పొడి మార్కెట్ లో కూడా దొరుకుతుంది.మొక్క తెచ్చుకొని కుండీల్లో పెంచుకోవచ్చు.