Meena Rasi : వైశాఖ పౌర్ణమి తరువాత మీన రాశి వారి జీవితంలో దూసుకు వస్తున్న మార్పులు…!

Meena Rasi : మీన రాశి వారికి ఈ నెల ఆఖరిలోపు ఉద్రిక్తతలన్నీ తగ్గుముఖం పడుతూ బుద్ధి చాలా చైతన్యంగా ఉంటుంది.ఆ చైతన్యత నుంచి చాలా విషయాలను గ్రహిస్తారు. అలాగే ఆవేశంతో మాట పెంచి గొడవలు పెట్టేటటువంటి వ్యక్తులను వీరు పసిగట్టగలుగుతారు. ఇలాంటి వారి తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఒక మాట మీ వెనుక మరొక మాట మాట్లాడతారు.కాబట్టి మీన రాశి వారికి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారు ఎవరితోనూ తగదాలకి పోకుండా సాత్వికమైన ఆలోచనలను కలిగి ఉండాలి. ఇక ఈ రాశి వారిలో పోలీస్ వ్యవహారాలలో విద్యార్థులు కానీ స్త్రీలు కానీ వెళ్లకపోవడం మంచిది.

అలాగే ప్రమాదాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి. విదేశాలలో ఉన్నటువంటి మీన రాశి వారు తప్పనిసరిగా అన్నదానం గోసేవ వంటివి చేసుకోవడం ద్వారా స్వధర్మాన్ని రక్షించుకున్న వారు అవుతారు. వైశాఖమాసంలో ఒక విశిష్టతమైన పర్వదినం కూడా ఉంది. అది వైశాఖ పౌర్ణమి ఇది మే 23వ తేదీన గురువారం వైశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది. వైశాఖ నక్షత్రనికి చాలా విశిష్టత ఉంది .అయితే ఈ యొక్క మీన రాశుల వారు గురు యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం.

సాధారణంగా గురువు సరైన స్థలంలో కనుక ఉన్నట్లయితే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు. అయితే పిల్లలకి గురు బలం చాలా అవసరం. కావున వైశాఖ పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా విశేషం. అలాగే శనగలను ఉడకబెట్టి దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికించిన తర్వాత వాటిని చల్లార్చి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఆవుకి పెట్టండి. దీని ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లైతే పిల్లలకి బుద్ధి బలం పెరుగుతుంది.

పరిహారాలు

మీనా రాశి వారికి లక్ష్మీ పూజ చాలా అనుగ్రహాన్ని ఇస్తుంది. లక్ష్మీ పూజ మరియు లక్ష్మీ అష్టోత్రం మంచిని కలిగిస్తుంది. అలాగే వారంలో ఒకరోజు ఇంటిని శుభ్రపరుచుకుని ఇంటి నిండా ధూపం వేసి లక్ష్మీ అష్టోత్తరాలు వినాలి. తద్వారా దారిద్య లక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది.